India VS New Zealand: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20కి వరుణుడి గండం..

మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. ఇప్పటికే స్వల్పంగా వర్షం పడి మైదానం చిత్తడిగా మారింది.

news18-telugu
Updated: January 23, 2020, 11:01 PM IST
India VS New Zealand: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20కి వరుణుడి గండం..
(Image: ICC)
  • Share this:
భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ-20 మ్యాచ్ కు కోహ్లీ సేన సర్వశక్తులు ఒడ్డుతోంది. న్యూజిలాండ్ లో కోహ్లీ సేన బోణీ కొట్టేందుకు భీకరంగా ప్రాక్టీస్ చేస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు ఆక్లాండ్‌ వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.50కి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. ఇప్పటికే స్వల్పంగా వర్షం పడి మైదానం చిత్తడిగా మారింది. దీంతో కవర్లు వేసి పిచ్ కాపాడుతున్నారు. ఒక వేళ వర్షం పడితే మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోలేదు. కివీస్‌తో తలపడుతున్న కోహ్లీ సేన.. అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులకు అలవాటు పడితే.. ఆస్ట్రేలియాలో జరిగే టీ 20 ప్రపంచకప్‌కు ఈ పరిస్థితులు ఉపయోగపడతాయనే టాక్ వినిపిస్తోంది.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు