IND vs NZ : టీమిండియాకి డక్ వర్త్ లూయిస్ వద్దు... ట్విట్టర్‌లో ఫ్యాన్స్ ట్వీట్ల తుఫాన్...

India vs Newzealand : ఇండియా-న్యూజిలాండ్ సెమీఫైనల్‌కి వర్షం అడ్డంకిగా మారడంతో... డక్ వర్త్ లూయిస్ విధానంపై చర్చ జరుగుతోంది. ఐతే... టీమిండియా ఫ్యాన్స్ మాత్రం... ఎట్టిపరిస్థితుల్లో డక్ వర్త్ లూయిస్ వద్దని ట్వీట్లు చేస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 10, 2019, 9:36 AM IST
IND vs NZ : టీమిండియాకి డక్ వర్త్ లూయిస్ వద్దు... ట్విట్టర్‌లో ఫ్యాన్స్ ట్వీట్ల తుఫాన్...
వర్షం వల్ల తడిచిన మైదానం (Image : Twitter/World Cup)
  • Share this:
ఇండియా, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్... వర్షం వల్ల మధ్యలో ఆగిపోయి... ఇవాళ్టికి వాయిదా పడింది. ఐతే... ఇవాళ కూడా వర్షం పడితే... డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం మ్యాచ్ కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఈ ప్రపంచకప్‌లో 40 రోజుల్లో 41 మ్యాచ్‌లను క్రికెట్ అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగుతున్న పరిస్థితి. ఈ టైంలో ఫ్యాన్స్ ఎమోషన్స్ పీక్ స్టేజ్‌లో ఉంటాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారత్ ప్రపంచకప్ గెలవాలని కోట్ల మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాంటి సమయంలో... వర్షాలు మ్యాచ్‌లను అడ్డుకుంటే అభిమానులు తీవ్ర నిరాశ చెందుతారు. దాదాపు వారం నుంచీ లేని వానలు సడెన్‌గా సెమీ ఫైనల్స్ నాడే రావాలా అని ఆవేదన చెందుతున్నారు.


ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో మంగళవారం కివీస్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు పడిన వర్షం... టీమిండియా ఫ్యాన్స్‌కి పరేషాన్ కలిగించింది. 46.1 పరుగుల దగ్గర న్యూజిలాండ్ 211/5గా నిలిచింది. ఇవాళ ఏదేమైనా వర్షం పడకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వర్షం పడితే... డక్ వర్త్ లూయిస్ ప్రకారం... టీంఇండియా తక్కువ ఓవర్లలో ఎక్కువ రన్స్ చెయ్యాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. జస్ట్ 20 ఓవర్లలో... టీమిండియా 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. ఇదే ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పిస్తోంది.


డక్ వర్త్ లూయిస్ విధానం వల్ల న్యూజిలాండ్‌కి కలిసొస్తుందనీ, అసలీ విధానాన్ని పాటించకూడదనీ భారత జట్టు ఫ్యాన్స్ కోరుతున్నారు.


అసలు వర్షం పడకూడదనీ, అదే అందరూ కోరుకోవాలనీ చెబుతూ ట్వీట్లు పెడుతున్నారు.

First published: July 10, 2019, 9:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading