Home /News /sports /

INDIA VS NEW ZEALAND DESPERATE INDIA LOOK TO KEEP T20 SERIES ALIVE IN AUCKLAND CR

Ind vs NZ: కసిలో రోహిత్ సేన... కూల్‌గా కివీస్ టీమ్... నిలవాలంటే గెలిచి తీరాలి...

పంత్

పంత్

మొదటి మ్యాచ్‌లో టీ20ల్లోనే అతి పెద్ద ఓటమి మూటగట్టుకున్న రోహిత్ టీమ్... కలవరపెడుతున్న కెప్టెన్ ఫామ్... ఇవాళ ఇరు జట్ల మధ్య రెండో టీ20...

న్యూజిలాండ్ టూర్ ముగియక ముందే ‘రన్ మెషిన్’ కెప్టెన్ విరాట్ కోహ్లీ... విశ్రాంతి తీసుకోవడం టీమిండియాను కష్టాల్లోకి నెట్టేసింది. కోహ్లీ లేకుండా ఆడిన నాలుగో వన్డేల్లో చిత్తుగా ఓడిన రోహిత్ టీమ్... చివరి వన్డేల్లో స్కోర్ చేయడానికి పోరాడాల్సి వచ్చింది. అంబటిరాయుడు, విజయ్ శంకర్, హర్దిక్ పాండ్యాల కారణంగా గౌరవప్రదమైన స్కోరు చేసి దాన్ని కాపాడుకోగలిగింది. మొదటి టీ20 మ్యాచ్‌లో అయితే పరిస్థితి మరీ దారుణం. జట్టులో 8 మంది బ్యాట్స్‌మెన్లు ఉన్నా... ఒక్కరంటే ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. ఫలితం టీ20ల్లోనే అతి పెద్ద ఓటమి. దాంతో రెండో టీ20 మ్యాచ్‌కి ముందు ఒత్తిడిలో పడింది రోహిత్ గ్యాంగ్. ముఖ్యంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఉన్న రోహిత్... నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్ చేజార్చుకుంటుండడం జట్టును ఆందోళనలోకి నెట్టేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇవాళ ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్కులో ఇండియా, కివీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి... సిరీస్ నెగ్గేయాలనే ఆలోచనతో కేన్ విలియంసన్ టీమ్ ఉంటే... సిరీస్ మీద ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా ఉంది. రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టులో మార్పులు జరిగే అవకాశం పక్కగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుకు ధారాళంగా పరుగులు సమర్పించిన ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యాలకు తుది టీమ్‌లో చోటు దక్కే అవకాశం ఉండకపోవచ్చు. వీరి స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ జట్టులోకి రావడం గ్యారెంటీ. మిగిలిన స్థానంలో హైదరాబాద్ బౌలర్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్‌లలో ఎవరో ఒకరిని తీసుకోవాలని రోహిత్ భావిస్తున్నాడు.

Cricket, Ind vs Nz, ind vs Nz 2nd T20I, team India, Rohit Sharma Captaincy, Dhoni, hardik pandya, ఇండియా vs న్యూజిలాండ్, క్రికెట్ న్యూస్, క్రికెట్ వార్తలు, న్యూజిలాండ్ టూర్, టీమిండియా, రిషబ్ పంత్, ధోనీ
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ (AP Photo/John Cowpland)


రోహిత్‌తో పాటు ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు అవుట్ అవుతాడో తెలియని మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ కూడా టీమిండియాను కలవరపెడుతోంది. కొత్త కుర్రాడు మొదటి మ్యాచ్‌లో బాగానే ఆడినా... రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హర్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. రోహిత్ రాణించకపోయినా వీరు రాణిస్తే రెండో మ్యాచ్‌లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కెప్టెన్ ఫామ్‌లోకి వస్తే ఆ కిక్ వేరేగా ఉంటుంది.

Cricket, Ind vs Nz, ind vs Nz 2nd T20I, team India, Rohit Sharma Captaincy, Dhoni, hardik pandya, ఇండియా vs న్యూజిలాండ్, క్రికెట్ న్యూస్, క్రికెట్ వార్తలు, న్యూజిలాండ్ టూర్, టీమిండియా, రిషబ్ పంత్, ధోనీ
టీమిండియా


మొదటి టీ20 మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ధోనీ... ముగ్గురు వికెట్ కీపర్లతో బరిలోకి దిగింది భారత జట్టు. వీరిలో దినేశ్ కార్తీక్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నా... చేతుల్లోకి వచ్చిన రెండు క్యాచ్‌లను నేలవిరిచాడు. కాబట్టి డీకేకు చోటు దక్కుతుందా? లేదా అనేది అనుమానంగా మారింది. మరోవైపు సీనియర్ బ్యాట్స్‌మెన్ గప్టిల్ గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన ఓపెనర్ టీమ్ సీఫర్ట్... అదరగొట్టాడు. 84 పరుగులు చేసి భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఇతనితో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా చెలరేగడంతో భారీ స్కోరు సాధించింది. మొదటి మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహం కారణంగా కూల్‌గా రెండో మ్యాచ్‌ను ముగించాలని భావిస్తోంది కివీస్ టీమ్.
First published:

Tags: Cricket, Ind vs nz t20 series

తదుపరి వార్తలు