India vs New Zealand: సూపర్ ఓవర్‌లో టీమిండియా విజయం...సిరీస్ కైవసం

India vs New Zealand: హామిల్టన్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన టీ20 మ్యాచులో ఇండియా గెలుపు అందుకుంది. కోహ్లీ సేన సూపర్ ఓవర్లో విజయం సాధించింది.

news18-telugu
Updated: January 29, 2020, 4:43 PM IST
India vs New Zealand: సూపర్ ఓవర్‌లో టీమిండియా విజయం...సిరీస్ కైవసం
India vs New Zealand
  • Share this:
India vs New Zealand: హామిల్టన్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన టీ20 మ్యాచులో ఇండియా గెలుపు అందుకుంది. కోహ్లీ సేన సూపర్ ఓవర్లో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని కివీస్ అందుకోలేకపోయింది. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 179/5 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ విజేత నిర్ణయించారు. సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ జట్టు 6 బంతుల్లో 18 పరుగులు చేయగా, టీమిండియా తరపున బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ చివరి రెండు బంతుల్లో 2 సిక్సర్లు బాదడంతో టీమిండియా విజయం సాధించింది. దీంతో 5 టీ20 మ్యాచుల సిరీస్ లో భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్వానించింది. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌లు చక్కటి శుభారంభాన్ని అందించారు. రోహిత్‌(65) వీరవిహారం చేస్తూ రెచ్చిపోయాడు. గత రెండు మ్యాచుల కన్నా భిన్నంగా మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఆరో ఓవర్‌లో తాను ఎదుర్కొన్న ఐదు బంతులను మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు. 23 బంతుల్లోనే రోహిత్ హాఫ్‌ సెంచరీ బాదేశాడు. మరో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌(27) సైతం నిలకడగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. రాహుల్ 9వ ఓవర్‌ చివరి బంతిలో ఔట్ అయ్యాడు. అనంతరం బెన్నెట్‌ బౌలింగ్‌లో రోహిత్‌, శివమ్‌ దుబె(3)లు వెంటవెంటనే ఔటు కావడంతో 96 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ క్రమంలో అయ్యర్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పరుగుల వేగం తగ్గడం, కివీస్‌ ఎటాకింగ్‌ బౌలింగ్‌కు అయ్యర్‌, కోహ్లిలు ఇబ్బందులకు గురయ్యారు. అయితే స్కోర్‌ను పెంచే క్రమంలో సాంట్నర్‌ బౌలింగ్‌లో అయ్యర్‌(17) కూడా నిష్క్రమించాడు. దీంతో నాలుగో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్కోర్‌ బోర్డు 160 పరుగుల వద్ద ఉన్న సమయంలో టీమిండియాను బెన్నెట్‌ మరోసారి దెబ్బతీశాడు. కోహ్లిని ఔట్‌ చేసి కివీస్‌ శిబిరంలో ఆనందం నింపాడు. ఇక చివర్లో మనీశ్‌ పాండే (16 నాటౌట్‌), జడేజా(10 నాటౌట్‌)లు దూకుడుగా ఆడటంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
Published by: Krishna Adithya
First published: January 29, 2020, 4:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading