IND vs NZ: రెండో టీ20లో భారత్ ఘనవిజయం...

భారత్, న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్‌లో జరుగుతున్న రెండో టీ20లో విరాట్ కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

news18-telugu
Updated: January 26, 2020, 4:00 PM IST
IND vs NZ: రెండో టీ20లో భారత్ ఘనవిజయం...
విరాట్ కోహ్లీ (Image: BCCI)
  • Share this:
భారత్, న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్‌లో జరుగుతున్న రెండో టీ20లో విరాట్ కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 133 పరుగుల తక్కువ స్కోర్‌ను ఛేదించే క్రమంలో కూడా భారత్ బ్యాట్స్‌మెన్ కొంచెం తడబడ్డారు. రోహిత్ శర్మ (6 బంతుల్లో 8 పరుగులు) రూపంలో ఫస్ట్ వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత కేఎల్ రాహుల్ వీరోచితంగా ఆడాడు. జట్టును విజయతీరానికి చేర్చాడు. 50 బంతుల్లో 57 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ చివరి వరకు 17.3 ఓవర్లలో మ్యాచ్ ముగియడానికి కీలకంగా మారాడు. విరాట్ కోహ్లీ (11 బంతుల్లో 12 పరుగులు), శ్రేయాస్ అయ్యర్ (33 బంతుల్లో 44 పరుగులు), శివమ్ దూబే (4 బంతుల్లో 8 పరుగులు నాటౌట్)గా నిలిచారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132/5 పరుగులు చేసింది. మార్టిన్ గుప్తిల్ (33), కొలిన్ మన్రో(26), టిమ్ సిఫర్ట్ (33) మినహా మిగితా బ్యాట్స్ మెన్ వేగంగా పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. ఫలితంగా న్యూజిలాండ్ స్వల్ప లక్ష్యాన్నే టీమిండియా ముందు ఉంచింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టగా, శివం దూబే, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ చెరోవికెట్ పడగొట్టారు.

భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. బూమ్రా, శివమ్ దూబే, ఎస్ఎన్ ఠాకూర్‌కు తలో వికెట్ పడింది. దీంతో కివీస్ నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టీజీ సౌథీకి రెండు వికెట్లు దక్కాయి. ఐఎస్ సోధీకి ఒక వికెట్ పడింది.

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. రెండుసార్లు ఛేజింగ్‌లో గెలుపొందింది. దీంతో 2-0తో భారత్ ముందంజలో ఉంది. మూడో టీ20 29వ తేదీన హామిల్టన్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు జరగనుంది.

First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు