India vs New Zealand: 5 సారీ కివీస్ చిత్తు..సిరీస్ టీమిండియా కైవసం...

న్యూజిలాండ్ తో జరుగుతున్న 5 టీ20 మ్యాచుల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. 5వ టీ20లో కూడా టీమిండియా చేతిలో కివీస్ ఓటమి పాలవడంతో 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.


Updated: February 2, 2020, 4:07 PM IST
India vs New Zealand: 5 సారీ కివీస్ చిత్తు..సిరీస్ టీమిండియా కైవసం...
(BCCI)
  • Share this:
న్యూజిలాండ్ తో జరుగుతున్న 5 టీ20 మ్యాచుల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. 5వ టీ20లో కూడా టీమిండియా చేతిలో కివీస్ ఓటమి పాలవడంతో 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 164 పరుగులను ఛేదించడంలో కివీస్ సేన తడబాటుకు గురైంది.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 5వ వన్డేలో భారత్ ప్రయోగాలకు చోటిచ్చింది. ఇందులో భాగంగా కేఎల్‌ రాహుల్‌, శాంసన్‌లు ఓపెనర్లుగా వచ్చారు. అయితే శాంసన్‌ ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని ఔట్ అయ్యాడు. దీంతో 8 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రాహుల్‌కు జత కలిసిన రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కేఎల్‌ రాహుల్‌(45), రోహిత్‌ శర్మ(60) జోరుగా ఆడటంతో భారీ స్కోరు దిశగా స్కోరుబోర్డు కదిలింది. ఫలితంగా జట్టు స్కోరు 96 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై రోహిత్‌ శర్మ-అయ్యర్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా కొనసాగించారు. రోహిత్‌ శర్మ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా, రోహిత్‌ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రిటైర్డ్‌హర్ట్‌ అయ్యాడు. కాలి కండరాలు పట్టేయడంతో పెవిలియన్‌ చేరాడు. దాంతో క్రీజ్‌లోకి వచ్చిన దూబే(5) నిరాశపరిచాడు. చివర్లో మనీష్‌ పాండే(11 నాటౌట్‌: 4 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌(33 నాటౌట్‌) 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో కుగ్‌లీన​ రెండు వికెట్లు సాధించగా,బెన్నెట్‌కు వికెట్‌ లభించింది.
First published: February 2, 2020, 4:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading