India vs New Zealand: కివీస్‌లో టీమిండియా బోణి...కోహ్లీ సేన ఘన విజయం

ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా జట్టు న్యూజిలాండ్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన 204 టార్గెట్ ను కోహ్లీ సేన ఛేదించింది.

news18-telugu
Updated: January 24, 2020, 4:07 PM IST
India vs New Zealand: కివీస్‌లో టీమిండియా బోణి...కోహ్లీ సేన ఘన విజయం
(Image: BCCI)
  • Share this:
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా జట్టు న్యూజిలాండ్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన 204 టార్గెట్ ను కోహ్లీ సేన ఛేదించింది. అయితే ఇన్నింగ్స్ ప్రారంభంలో ఓపెనర్ రోహిత్ శర్మ(7) పరుగులకే ఔట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చి కోహ్లీ (45), కేఎల్ రాహుల్ (56) బ్యాటు ఝుళిపించడంతో టీమిండియా విజయం వైపు వడివడిగా కదిలింది. ఆ తర్వాత కోహ్లీ, రాహుల్ ఔట్ అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ రాణించడంతో గెలుపు సులభమైంది.

ఇదిలా ఉంటే కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ జట్టు 203 పరుగులు చేసింది. టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టుకు ఓపెనర్లు 80 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 19 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 30 పరుగులు చేశాడు. ఓపెనర్ మున్రో మాత్రం 42 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 59 పరుగులు చేసి కివీస్‌ జట్టు స్కోర్‌లో తనదైన పాత్ర పోషించాడు. ఆ తర్వాత కెప్టెన్ విలియమ్‌సన్ కూడా 26 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 51 పరుగులు చేసి రాణించాడు.  టీమిండియా బౌలర్లలో బూమ్రా, శార్దూల్ ఠాకూర్, జడేజా, చాహల్, శివమ్ దూబేలకు తలో వికెట్ దక్కింది.
First published: January 24, 2020, 3:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading