Home /News /sports /

INDIA VS LEICESTERSHIRE WARM UP MATCH TEAM INDIA STAR VIRAT KOHLI TRIED TO MAKE HIS BAT STAND UPRIGHT LIKE ROOT SJN

IND vs ENG : క్రికెట్ వదిలేసి మంత్రగాడిగా మారిపోయిన కోహ్లీ.. లేదంటే ఏంది ఇదీ.. చిన్న పిల్లోడిలా?

PC : TWITTER

PC : TWITTER

India vs Leicestershire Practice Match : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మొహమ్మద్ షమీ (Mohammed Shami) లాంటి స్టార్ ప్లేయర్లు తొలిసారి మైదానంలోకి దిగారు.

ఇంకా చదవండి ...
India vs Leicestershire Practice Match : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మొహమ్మద్ షమీ (Mohammed Shami) లాంటి స్టార్ ప్లేయర్లు తొలిసారి మైదానంలోకి దిగారు. జూలై 1 నుంచి ఇంగ్లండ్ (England)తో జరిగే రీషెడ్యూల్ టెస్టు మ్యాచ్ కోసం సన్నాహకంగా జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు. నాలుగు రోజుల పాటు లీసెస్టర్ షైర్ కౌంటీ టీంతో టీమిండియా (Team India) వార్మమ్ మ్యాచ్ గురువారం ఆరంభమైంది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో అని భారత అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా కోహ్లీ గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అడపాదడపా అర్ధ సెంచరీలు బాదుతున్నా.. కెరీర్ తొలినాళ్లలోని కోహ్లీని మాత్రం మళ్లీ చూపించడం లేదు. ఈ క్రమంలో బిగ్ ఫైట్ కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లో కోహ్లీ చెలరేగుతాడని అంతా భావించారు. కానీ.. కోహ్లీ మాత్రం తన ఆట మీద ధ్యాస పెట్టకుండా గారడీ విద్యలు చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు.

ఇది కూడా చదవండి  : రోహిత్ అతడితో కాస్త జాగ్రత్తా.. చూస్తుంటే నీ పోస్ట్ కే ఎసరు పెట్టేలా ఉన్నాడు!

తొలి రోజు ఆటలో విరాట్ కోహ్లీ.. ఫర్వాలేదనే చెప్పాలి. తన బ్యాటింగ్ లో స్వల్ప మార్పులను చేసుకున్న అతడు.. ఉన్నంతసేపు కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. అయితే ఆట మధ్యలో బ్యాట్ ను ఎటువంటి సాయం లేకుండా నిటారుగా నిలబెట్టేందుకు కష్టపడ్డాడు. పిచ్ పై బ్యాట్ ను ఉంచి చేతులు వదిలేసి.. బ్యాట్ ను నిటారుగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ’Kohli tried to make his bat stand upright like Root‘ అనే క్యాప్షన్ ను జతచేసిన ఓ అభిమాని దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.



ఆట మీద ధ్యాస పెట్టు కోహ్లీ.. అసలే పీక మీద వేటు అనే కత్తి వేలాడుతుంది అనే అర్థం వచ్చేలా కొందరు కామెంట్స్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 60.2 ఓవర్లలో 8 వికెట్లకు 246 పరుగులు చేసింది. కోహ్లీ (33; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించినా.. బిగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రోహిత్ శర్మ (25), శుబ్ మన్ గిల్ (21), హనుమ విహారి (3), శ్రేయస్ అయ్యర్ (0), రవీంద్ర జడేజా (13), శార్దుల్ ఠాకూర్ (6) విఫలం అయ్యారు. అయితే తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ (70 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) పోరాడటంతో భారత్ 200 మార్కును అందుకుంది. ప్రస్తుతం షమీ (18 బ్యాటింగ్)తో కలిసి భరత్ క్రీజులో ఉన్నారు. లీసెస్టర్ బౌలర్ రోమన్ వాకర్ 5 వికెట్లతో చెలరేగాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు