Home /News /sports /

INDIA VS LEICESTERSHIRE WARM UP MATCH MOHAMMED SHAMI DISMISSES PUJARA FOR DUCK THEN HIS CELEBRATION GONE VIRAL SJN

Mohammed Shami : ఏందబ్బా ఇదీ.. పుజారాను డకౌట్ చేసి ఆపై అతడితోనే సెలెబ్రేట్ చేసుకున్న షమీ (వీడియో)

PC : TWITTER

PC : TWITTER

IND vs ENG : భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య గతేడాది జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ కరోనా వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ను జూలై 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుపనున్నారు. ప్రస్తుతం భారత జట్టు లీసెస్టర్ షైర్ తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది.

ఇంకా చదవండి ...
IND vs ENG : భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య గతేడాది జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ కరోనా వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ను జూలై 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుపనున్నారు. ప్రస్తుతం భారత జట్టు లీసెస్టర్ షైర్ తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఇక ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లకు పూర్తి ప్రాక్టీస్ కల్పించేందుకు పలువురు టీమిండియా (Team India) ఆటగాళ్లు లీసెస్టర్ షైర్ తరఫున బరిలోకి దిగనున్నారు. పుజారా, రిషభ్ పంత్, ప్రసిధ్ కృష్ణ, జస్ ప్రీత్ బుమ్రాలు లీసెస్టర్ జట్టు తరఫున బరిలోకి దిగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 60.2 ఓవర్లలో 8 వికెట్లకు 246 పరుగులకు డిక్లేర్ చేసింది.

ఇది కూడా చదవండి : ’కోహ్లీ ఆటను భ్రష్టు పట్టించింది అతడే‘.. పాక్ స్పిన్నర్ సంచలన కామెంట్స్

అనంతరం లీసెస్టర్ షైర్ బ్యాటింగ్ కు దిగగా భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మొహమ్మద్ షమీ, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలో మొహమ్మద్ షమీ, చతేశ్వర్ పుజారా మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. లీసెస్టర్ షైర్ తరఫున బ్యాటింగ్ కు దిగిన చతేశ్వర్ పుజారా.. 6 బంతులు ఎదుర్కొని షమీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో షమీ చేసుకున్న సెలెబ్రేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.



డకౌట్ అయిన పుజారా పెవిలియన్ బాట పట్టగా.. షమీ అతడి దగ్గరకు వెళ్లి వికెట్ ను సెలెబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పుజారా వికెట్ తీసిన ఆనందంలో పంత్ అతడి వీపుపై ఎగురుతూ వికెట్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో లీసెస్టర్ షైర్ 57 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా టీమిండియాకు కేవలం 2 పరుగుల ఆధిక్యం లభించింది. రిషభ్ పంత్ (76; 14 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఐదు వికెట్లతో రాణించిన రోమన్ వాకర్ (34; 7 ఫోర్లు) బ్యాట్ తోనూ రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా 18 ఓవర్లలో వికెట్ నష్టపోయి 80 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ హీరో శ్రీకర్ భరత్ (31 బ్యాటింగ్; 5 ఫోర్లు), హనుమ విహారి (9 బ్యాటింగ్ ; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. శుబ్ మన్ గిల్ (38; 8 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గా రాకపోవడం విశేషం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cheteswar Pujara, India vs england, Mohammed Shami, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు