Home /News /sports /

INDIA VS LEICESTERSHIRE WARM UP MATCH JASPRIT BUMRAH BALL HITS TEAM INDIA CAPTAIN ROHIT SHARMA LOWER STOMACH SJN

Rohit Sharma : బుమ్రా దెబ్బకు విలవిల్లాడిన రోహిత్..పాపం ఎవరికి చెప్పుకోవాలో తెలియక పడరాని పాట్లు పడ్డ హిట్ మ్యాన్..

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma : టీమిండియా (Team India)కు ఫుల్ టైమ్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ (Rohit Shrama)కు తొలిసారి కఠిన సవాల్ ఎదురుకానుంది. కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత న్యూజిలాండ్ (New Zealand)పై టెస్టు సిరీస్ గెలిచినా.. అది భారత్ వేదికగా జరగడం.. కివీస్ టీం స్టార్ ప్లేయర్లు లేకుండానే ఆడింది.

ఇంకా చదవండి ...
Rohit Sharma : టీమిండియా (Team India)కు ఫుల్ టైమ్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ (Rohit Shrama)కు తొలిసారి కఠిన సవాల్ ఎదురుకానుంది. కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత న్యూజిలాండ్ (New Zealand)పై టెస్టు సిరీస్ గెలిచినా.. అది భారత్ వేదికగా జరగడం.. కివీస్ టీం స్టార్ ప్లేయర్లు లేకుండానే ఆడింది. అనంతరం శ్రీలంక, వెస్టిండీస్ లాంటి కూనలపై వన్డే, టి20 సిరీస్ లను నెగ్గింది. అయితే తొలిసారి రోహిత్ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్ తో వారి దేశంలోనే అమీతుమీకి సిద్ధమైంది. జూలై 1 నుంచి ఆరంభమయ్యే గతేడాది జరగాల్సిన ఐదో టెస్టు (రీషెడ్యూల్)లో ఇరు జట్లు కూడా పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు సన్నాహకంగా నాలుగు రోజుల పాటు లీసెస్టర్ షైర్ తో వార్మమ్ మ్యాచ్ కూడా ఆడుతోంది.

ఇది కూడా చదవండి : క్రికెట్ వదిలేసి మంత్రగాడిగా మారిపోయిన కోహ్లీ.. లేదంటే ఏంది ఇదీ.. చిన్న పిల్లోడిలా?

ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా సారథి రోహిత్ శర్మకు భారత బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించాడు. అదేంటి బుమ్రా టీమిండియా కదా.. అలాంటప్పుడు అతడు రోహిత్ కు చుక్కలు చూపించడం ఏంటని అనుకుంటున్నారా.? వాస్తవానికి భారత్ కు చెందిన నలుగురు ప్లేయర్లు.. చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, బుమ్రా, ప్రసిధ్ లు లీసెస్టర్ షైర్ జట్టు తరఫున బరిలోకి దిగారు. భారత జట్టులోని 15 మందికి ప్రాక్టీస్ లభించేవిధంగా టీమిండియా మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బుమ్రా వేసిన ఒక బంతి హిట్ మ్యాన్ కు తగలరాని చోటున తగిలింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.



భారత్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ను వేయడానికి బుమ్రా వచ్చాడు. తొలి బంతిని వేయగా.. అది నేరుగా వెళ్లి రోహిత్ పొత్తి కడుపు కింది భాగంలో తగిలింది. దాంతో రోహిత్ శర్మ కాసేపు విలవిల్లాడాడు. బంతి తగిలి రోహిత్ బాధ పడుతుంటే బుమ్రా కనీసం అతడి దగ్గరకు వెళ్లి అతడికి ఏమైందో అని కూడా కనుక్కోలేదు. అయితే కాసేపు మోకాళ్లపై కూర్చున్న రోహిత్.. అనంతరం లేచి బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ మ్యాచ్ లో 25 పరుగులు చేసిన అతడు ఫుల్ షాట్ కు ప్రయత్నించి వికెట్ ను పారేసుకున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs england, Jasprit Bumrah, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు