INDIA VS IRELAND PREVIEW SURYAKUMAR YADAV IN SANJU SAMSON DOUBT HERE TEAM INDIA PREDICTED PLAYING XI AGAINST IRELAND IN FIRST T20I SRD
India vs Ireland : ఆ ఇద్దర్నీ ఇప్పుడైనా ఆడిస్తారా..? సంజూ డౌటే.. ఐర్లాండ్ తో బరిలోకి దిగే తుది జట్టు ఇదే..!
Team India (PC : BCCI)
India vs Ireland : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో 3, 4 స్థానాలను భర్తీ చేసిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్.. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ కోసం వెళ్లిపోయారు. వారు ఖాళీ చేసిన స్థానాల్లో ఐర్లాండ్‌పై ఎవరు ఆడతారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్.
రాబోయే టీ20 సిరీస్ లు టీమిండియా (Team India)కు ఎంతో కీలకం. ఆస్ట్రేలియా (Australia) వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2022(T20 World Cup 2022)కు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో.. కుర్రాళ్లను పరీక్షించడానికి రెడీ అయింది టీమిండియా. ఈ నేపథ్యంలో భారత్, ఐర్లాండ్ (India vs Ireland) మధ్య ఆదివారం నుంచి రెండు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఆది, మంగళవారాల్లో రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియా కీలక ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నందున ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.
రోహిత్ (Rohit Sharma) నేతృత్వంలోని టెస్టు జట్టులో గత ఏడాది సిరీస్‌లో మిగిలిపోయిన చివరి మ్యాచ్‌ను ఆడేందుకు సన్నాహాల్లో ఉంటే.. హార్దిక్ (Hardik Pandya) నాయకత్వంలో టీ20 జట్టు ఐర్లాండ్‌ను ఢీకొనబోతోంది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు జట్టుతో పాటు ఉండడంతో జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ లక్ష్మణ్ ఈ సిరీస్‌కు హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్‌తో ఆడబోయే జట్టులో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఉండటంతో ఆ రెండు స్థానాల్లో ఎవర్ని భర్తీ చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో 3, 4 స్థానాలను భర్తీ చేసిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్.. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ కోసం వెళ్లిపోయారు. వారు ఖాళీ చేసిన స్థానాల్లో ఐర్లాండ్‌పై ఎవరు ఆడతారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. గాయం కారణంగా సఫారీలతో సిరీస్‌కు అందుబాటులో లేని సూర్యకుమార్ యాదవ్‌తో పాటు చాలా రోజుల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్, కొత్తగా అవకాశం దక్కించుకున్న రాహుల్ త్రిపాఠి, ఆల్‌రౌండర్లు వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా రేసులో ఉన్నారు.
సూర్యకుమార్ టీ20 ఫార్మాట్ లో ఎంతో కీలక ప్లేయర్. అలాగే, ఇంతకుముందు వచ్చిన ఛాన్సుల్ని సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో.. మూడో స్థానంలో అతడి ఆడటం ఖాయం. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లు బరిలోకి దిగనున్నారు. సఫారీ సిరీస్ లో మోస్తరు ప్రదర్శన చేసిన రుతురాజ్ ని పక్కన పెట్టాలనుకుంటే.. సంజూ శాంసన్ ను ఓపెనింగ్ పంపే అవకాశం ఉంది.
మరోవైపు వెంకటేష్ అయ్యర్ ఫాంలో లేడు. దీంతో, సంజూ, త్రిపాఠి, దీపక్ హుడాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బౌలింగ్ వేయగల సామర్థ్యం ఉన్న దీపక్ హుడాని ఆడించే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయ్. 5, 6 స్థానాల్లో కెప్టెన్ హార్దిక్, ఫినిషర్ కార్తీక్ ఆడతారు. చాహల్‌కు తోడు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌నే ఆడిస్తారా.. లేక ఐర్లాండ్ పిచ్‌లకు తగ్గట్లు వెంకటేశ్‌ను ఏమైనా ఎంచుకుంటారా అన్నది చూడాలి.
మరోవైపు.. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో అవకాశం దక్కించుకోని యువ పేసర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ ఈ సిరీస్‌లో మైదానంలోకి దిగే అవకాశాలున్నాయి. దక్షిణాఫ్రికాపై తుది జట్టులో ఆడిన భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్ ఈ సిరీస్‌లోనూ కొనసాగుతున్నారు. అయితే అవేష్తో పాటు మిగతా ఇద్దరిలో ఒక్కొక్కరిని ఒక్కో మ్యాచ్‌కు పక్కన పెట్టి అయినా ఉమ్రాన్, అర్ష్‌దీప్‌లకు అవకాశమివ్వొచ్ఛు ప్రత్యర్థి చిన్న జట్టే కాబట్టి కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండకపోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.