Home /News /sports /

INDIA VS IRELAND LIVE SCORE UPDATES TEAM INDIA WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD 2

India vs Ireland : ఇషాన్ - హుడా - పాండ్యా షో.. 9.2 ఓవర్లలో టార్గెట్ ఫినిష్.. ఫస్ట్ టీ20 టీమిండియాదే..

Team India ( PC : BCCI)

Team India ( PC : BCCI)

India vs Ireland : హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యంగ్ టీమిండియా అదరగొట్టింది. రెండు మ్యాచుల టీ20 సిరీస్ లో ఫస్ట్ మ్యాచును నెగ్గి 1-0 ఆధిక్యంలో వెళ్లింది భారత జట్టు.

    ఐర్లాండ్ తో జరుగుతున్న ఫస్ట్ టీ20 లో టీమిండియా అదరగొట్టింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యంగ్ భారత్ .. ఐర్లాండ్ జట్టును చిత్తు చేసింది. ఐర్లాండ్ సెట్ చేసిన 109 పరుగుల టార్గెట్ ను రెండు వికెట్లు కోల్పోయి కేవలం ఓవర్లలో ఫినిష్ చేసింది. దీపక్ హుడా (29 బంతుల్లో 47 పరుగులు ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 24 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ ( 11 బంతుల్లో 26 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. క్రెయిగ్ యంగ్ రెండు వికెట్లు తీయగా.. జోషువా ఒక వికెట్ తో సత్తా చాటాడు.109 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఓపెనింగ్ ఆరంభం లభించింది. రుతురాజ్ బదులు.. దీపక్ హుడా.. ఇషాన్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇక, తనదైన స్టైల్ లో ఇషాన్ కిషన్ దూకుడుగా తన ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఫస్ట్ ఓవర్ నుంచి బౌండరీల వర్షం కురిపించాడు. 10 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు.

    అయితే.. డేంజర్ గా మారుతున్న ఇషాన్ (26) ని క్లీన్ బౌల్డ్ చేశాడు యంగ్. దీంతో.. 30 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత బంతికే సూర్యకుమార్ యాదవ్ డకౌటయ్యాడు. దీంతో.. 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా కోల్పోయిన రెండు వికెట్లు క్రెయిగ్ యంగ్ కే దక్కడం విశేషం.



    ఆ తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ను హార్దిక్, దీపక్ హుడా ఆదుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఈ ఇద్దరూ బౌండరీలు బాదుతూ.. స్కోరు వేగం తగ్గకుండా చూసుకున్నారు. ముఖ్యంగా ఆండీ మెక్ బ్రెయిన్ వేసిన ఆరో ఓవర్ లో ఏకంగా 21 పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ మూడో వికెట్ కు 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే, హార్దిక్ పాండ్యా.. జోషువా లిటిల్ ఔట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. హార్దిక్ ఔటైనా.. ఆఖర్లో మిగతా బ్యాటర్లు లాంఛనాన్ని పూర్తి చేశారు.


    అంతకుముందు.. హ్యారీ టెక్టార్ సూపర్ బ్యాటింగ్ తో ఐర్లాండ్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. వర్షం కారణంగా 12వ ఓవర్లకు ఈ మ్యాచ్ ను కుదించారు. వర్షం ఎఫెక్ట్ తో ఫస్ట్ ఐదు ఓవర్లు స్వింగ్ కు అనుకూలించింది. ఆ తర్వాత ఐరీష్ ఇన్నింగ్స్ ను టెక్టార్ ఆదుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ ( 33 బంతుల్లో 64 పరుగులు ; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. టెక్టార్ సూపర్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 12వ ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువీ, హార్దిక్, ఆవేశ్, చాహల్ తలా ఓ వికెట్ తీశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Dinesh Karthik, Hardik Pandya, Sanju Samson, Team India, Umran Malik

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు