Home /News /sports /

INDIA VS IRELAND LIVE SCORE UPDATES TEAM INDIA WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD

India vs Ireland : టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులోకి ఉమ్రాన్ మాలిక్.. అతనికి మరోసారి నిరాశే..

India vs Ireland : రోహిత్‌ (Rohit Sharma) నేతృత్వంలోని టెస్టు జట్టులో గత ఏడాది సిరీస్‌లో మిగిలిపోయిన చివరి మ్యాచ్‌ను ఆడేందుకు సన్నాహాల్లో ఉంటే.. హార్దిక్‌ (Hardik Pandya) నాయకత్వంలో టీ20 జట్టు ఐర్లాండ్‌ను ఢీకొనబోతోంది.

India vs Ireland : రోహిత్‌ (Rohit Sharma) నేతృత్వంలోని టెస్టు జట్టులో గత ఏడాది సిరీస్‌లో మిగిలిపోయిన చివరి మ్యాచ్‌ను ఆడేందుకు సన్నాహాల్లో ఉంటే.. హార్దిక్‌ (Hardik Pandya) నాయకత్వంలో టీ20 జట్టు ఐర్లాండ్‌ను ఢీకొనబోతోంది.

India vs Ireland : రోహిత్‌ (Rohit Sharma) నేతృత్వంలోని టెస్టు జట్టులో గత ఏడాది సిరీస్‌లో మిగిలిపోయిన చివరి మ్యాచ్‌ను ఆడేందుకు సన్నాహాల్లో ఉంటే.. హార్దిక్‌ (Hardik Pandya) నాయకత్వంలో టీ20 జట్టు ఐర్లాండ్‌ను ఢీకొనబోతోంది.

    ఇంగ్లండ్‌తో కీలకమైన ఐదో టెస్టుకు ముందు టీమిండియా ధనాధన్ సిరీస్ కు సన్నద్ధమైంది. ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు టీమిండియా కుర్రాళ్లు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని ఐర్లాండ్‌ కూడా భావిస్తోంది. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. వాతావరణ పరిస్థితుల్ని గమనించిన హార్దిక్.. ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపాడు. ఇక, నిప్పులు చెరిగే ఉమ్రాన్ మాలిక్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సంజూ శాంసన్ కు మరో సారి నిరాశే ఎదురైంది. ఐర్లాండ్ తరఫున కోనార్ ఓల్ ఫర్ట్ అరంగేట్రం చేయనున్నాడు. అయితే, ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది. . వర్షం వల్ల మ్యాచ్ ఆరంభం ఆలస్యం కానుంది.రాబోయే టీ20 సిరీస్ లుటీమిండియా (Team India)కు ఎంతో కీలకం.

    ఆస్ట్రేలియా (Australia) వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2022(T20 World Cup 2022)కు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో.. కుర్రాళ్లను పరీక్షించడానికి రెడీ అయింది టీమిండియా. ఈ నేపథ్యంలో భారత్, ఐర్లాండ్ (India vs Ireland)సిరీస్ ఎంతో కీలకం కానుంది.


    రోహిత్‌ (Rohit Sharma) నేతృత్వంలోని టెస్టు జట్టులో గత ఏడాది సిరీస్‌లో మిగిలిపోయిన చివరి మ్యాచ్‌ను ఆడేందుకు సన్నాహాల్లో ఉంటే.. హార్దిక్‌ (Hardik Pandya) నాయకత్వంలో టీ20 జట్టు ఐర్లాండ్‌ను ఢీకొనబోతోంది. ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ టెస్టు జట్టుతో పాటు ఉండడంతో జాతీయ క్రికెట్‌ అకాడమీ ఛైర్మన్‌ లక్ష్మణ్‌ ఈ సిరీస్‌కు హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు.

    టీమిండియాలో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లు బరిలోకి దిగనున్నారు. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. దినేష్ కార్తీక్ మరోసారి ఫినిషర్ రోల్ ప్లే చేయనున్నాడు. అక్షర్ పటేల్, చాహల్ స్పిన్ బాధ్యతల్ని మోయనున్నారు. ఉమ్రాన్, భువనేశ్వర్, అవేశ్ ఖాన్ పేస్ బౌలింగ్ భారం మోయనున్నారు. మరోవైపు.. పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్నిర్నే, డెలానీ, టెక్టర్, క్యాంపర్ వంటి డేంజర్ ప్లేయర్లతో ఐర్లాండ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఐర్లాండ్ ను తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.

    తుది జట్లు :
    భారత్: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్

    ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్నిర్నే(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లక్రాన్ టక్కర్(కీపర్), ఆండీ మెక్‌బైన్, జార్జ్ డాక్‌రెల్, మార్క్ అడైర్, క్రెగ్ యంగ్, జోషువా లిటిల్, కోనార్ ఓల్ ఫర్ట్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Hardik Pandya, Sanju Samson, Team India, Umran Malik

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు