టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. డబ్లిన్ లో వర్షం ఆగిపోయింది. మ్యాచ్ ఆరంభమైంది. భారీ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచును 12 ఓవర్లకు కుదించారు. అంటే, చెరో జట్టు 12 ఓవర్లు ఆడనున్నారు. ఇద్దరూ బౌలర్లు చెరో మూడు ఓవర్లు, మిగతా బౌలర్లు తలా రెండు ఓవర్లు వెయ్యాలి. పవర్ ప్లే నాలుగు ఓవర్లుగా నిర్ణయించారు. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. వాతావరణ పరిస్థితుల్ని గమనించిన హార్దిక్.. ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపాడు. టాస్ కు ముందు కూడా వర్షం పడింది. ఆ తర్వాత కాసేపు ఆగిపోయింది. టాస్ తర్వాత భారీ వర్షం మొదలైంది.
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ఫలితాన్ని తేలకుండా చేసిన వరుణుడు, ఐర్లాండ్‌లో ప్రత్యేక్షం కావడం విశేషం. సౌతాఫ్రికాతో జరగాల్సిన ఐదో టెస్టు వర్షం కారణంగా రద్దు కావడంతో టీ20 సిరీస్ 2-2 తో డ్రాగా ముగిసింది. ఇక, నిప్పులు చెరిగే ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. సంజూ శాంసన్ కు మరో సారి నిరాశే ఎదురైంది. ఐర్లాండ్ తరఫున కోనార్ ఓల్ ఫర్ట్ అరంగేట్రం చేయనున్నాడు.
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి తొలిసారి పిలుపు దక్కించుకున్న రాహుల్ త్రిపాఠి మాత్రం ఆరంగ్రేటం కోసం మరికొంత కాలం ఎదురుచూడాల్సి వస్తోంది. రాహుల్ త్రిపాఠితో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కి తుది జట్టులో చోటు కల్పించలేదు టీమిండియా. రోహిత్ (Rohit Sharma) నేతృత్వంలోని టెస్టు జట్టులో గత ఏడాది సిరీస్‌లో మిగిలిపోయిన చివరి మ్యాచ్‌ను ఆడేందుకు సన్నాహాల్లో ఉంటే.. హార్దిక్ (Hardik Pandya) నాయకత్వంలో టీ20 జట్టు ఐర్లాండ్‌ను ఢీకొనబోతోంది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు జట్టుతో పాటు ఉండడంతో జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ లక్ష్మణ్ ఈ సిరీస్‌కు హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు.
టీమిండియాలో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లు బరిలోకి దిగనున్నారు. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. దినేష్ కార్తీక్ మరోసారి ఫినిషర్ రోల్ ప్లే చేయనున్నాడు. అక్షర్ పటేల్, చాహల్ స్పిన్ బాధ్యతల్ని మోయనున్నారు. ఉమ్రాన్, భువనేశ్వర్, అవేశ్ ఖాన్ పేస్ బౌలింగ్ భారం మోయనున్నారు. మరోవైపు.. పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్నిర్నే, డెలానీ, టెక్టర్, క్యాంపర్ వంటి డేంజర్ ప్లేయర్లతో ఐర్లాండ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఐర్లాండ్ ను తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్నిర్నే(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లక్రాన్ టక్కర్(కీపర్), ఆండీ మెక్‌బైన్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, క్రెగ్ యంగ్, జోషువా లిటిల్, కోనార్ ఓల్ ఫర్ట్
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.