Home /News /sports /

INDIA VS IRELAND LIVE SCORE UPDATES IRELAND TEAM SETS FIGHTING TOTAL ON SCORE BOARD AND HARRY TECTOR PLAYS SUPER KNOCK SRD

India vs Ireland : టెక్టార్ మెరుపులు.. టీమిండియా ముందు ఐర్లాండ్ ఫైటింగ్ టోటల్..

PC : Twitter

PC : Twitter

India vs Ireland : వర్షం కారణంగా ఈ మ్యాచును 12వ ఓవర్లకు కుదించారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ టీమిండియా ముందు ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.

    డబ్లిన్ వేదికగా వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న ఫస్ట్ టీ20లో ఐర్లాండ్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. వర్షం కారణంగా 12వ ఓవర్లకు ఈ మ్యాచ్ ను కుదించారు. వర్షం ఎఫెక్ట్ తో ఫస్ట్ ఐదు ఓవర్లు స్వింగ్ కు అనుకూలించింది. ఆ తర్వాత ఐరీష్ ఇన్నింగ్స్ ను టెక్టార్ ఆదుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ ( 33 బంతుల్లో 64 పరుగులు ; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. టెక్టార్ సూపర్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 12వ ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువీ, హార్దిక్, ఆవేశ్, చాహల్ తలా ఓ వికెట్ తీశారు. 12 వ ఓవర్ల మ్యాచులో టాస్ ఓడిపోయిన బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ కు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయ్. ఐరీష్ కెప్టెన్ ఆండ్రూ బలబ్రిన్ భువీ బౌలింగ్ లో డకౌటయ్యాడు. దీంతో.. 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్ లో డేంజరస్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ కూడా ఔటయ్యాడు.

    హార్దిక్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన స్టిర్లింగ్ నాలుగు పరుగులు చేసి.. దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అవేష్ ఖాన్ బౌలింగ్ లో 8 పరుగులు చేసిన గెరాత్ డెలానీ.. కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఐర్లాండ్ టీం. అయితే.. కష్టాల్లో పడ్డ ఐరీష్ ఇన్నింగ్స్ ను హ్యారీ టెక్టర్, టక్కర్ ఆదుకున్నారు.

    వీరిద్దరూ నాలుగో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని చాహల్ విడదీశాడు. 18 పరుగులు చేసిన టక్కర్.. అక్షర్ పటేల్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 72 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. టెక్టార్ తన జోరు ఆపలేదు. ఈ క్రమంలో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో కూడా టెక్టార్ రెచ్చిపోవడంతో.. ఐర్లాండ్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.

    భారీ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచును 12 ఓవర్లకు కుదించారు. అంటే, చెరో జట్టు 12 ఓవర్లు ఆడనున్నారు. ఇద్దరూ బౌలర్లు చెరో మూడు ఓవర్లు, మిగతా బౌలర్లు తలా రెండు ఓవర్లు వెయ్యాలి. పవర్ ప్లే నాలుగు ఓవర్లుగా నిర్ణయించారు. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.

    వాతావరణ పరిస్థితుల్ని గమనించిన హార్దిక్.. ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపాడు. టాస్ కు ముందు కూడా వర్షం పడింది. సంజూ శాంసన్ ను ఈ మ్యాచులో కూడా నిరాశ ఎదురైంది.ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి తొలిసారి పిలుపు దక్కించుకున్న రాహుల్ త్రిపాఠి మాత్రం ఆరంగ్రేటం కోసం మరికొంత కాలం ఎదురుచూడాల్సి వస్తోంది. రాహుల్ త్రిపాఠితో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కి తుది జట్టులో చోటు కల్పించలేదు టీమిండియా

    తుది జట్లు :
    భారత్: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్

    ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్నిర్నే(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లక్రాన్ టక్కర్(కీపర్), ఆండీ మెక్‌బైన్, జార్జ్ డాక్‌రెల్, మార్క్ అడైర్, క్రెగ్ యంగ్, జోషువా లిటిల్, కోనార్ ఓల్ ఫర్ట్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Hardik Pandya, Team India, Umran Malik

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు