INDIA VS IRELAND 2ND T20I LIVE SCORE UPDATES RUTURAJ GAIKWAD OUT SANJU SAMSON IN HERE TEAM INDIA PREDICTED PLAYING XI SRD
India vs Ireland : గాయంతో ఆ ప్లేయర్ ఔట్.. సంజూ శాంసన్ కి లక్కీ ఛాన్స్.. రెండో టీ20కి భారత తుది జట్టు ఇదే!
Team India ( PC : BCCI)
India vs Ireland : ఫస్ట్ మ్యాచులో డకౌట్ తో విఫలమైన సూర్యకుమార్ యాదవ్ కి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో.. ఐపీఎల్ లో సత్తా చాటిన రాహుల్ త్రిపాఠికి మరో సారి నిరాశే ఎదురుకానుంది.
ఐర్లాండ్ తో జరుగుతున్న ఫస్ట్ టీ20 లో టీమిండియా (Team India) అదరగొట్టింది. హార్దిక్ పాండ్యానేతృత్వంలోని యంగ్ భారత్ .. ఐర్లాండ్ జట్టును చిత్తు చేసింది. ఐర్లాండ్ సెట్ చేసిన 109 పరుగుల టార్గెట్ ను రెండు వికెట్లు కోల్పోయి కేవలం ఓవర్లలో ఫినిష్ చేసింది. దీంతో సిరీస్ లోకి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పుడు చివరి పోరుకు సై అంటోంది హార్దిక్ సేన (Hardik Pandya Team). మంగళవారం జరిగే రెండో టీ20లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది టీమిండియా. మరోవైపు.. తొలి మ్యాచులో ఓడిన ఐర్లాండ్ జట్టు (Ireland Team).. ఈ మ్యాచులో కనీస పోటీనైనా ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. ఇక, ఫస్ట్ మ్యాచులో మోకాలి గాయంతో బ్యాటింగ్ కు రాని రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad).. రెండో మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా తుదిజట్టులో జరిగే మార్పులపై ఓ లుక్కేద్దాం.
తొలి టీ20లో రుతురాజ్ గాయంతో దూరమవడంతో దీపక్ హుడా(Deepak Hooda) ఓపెనర్ గా బరిలోకి దిగాడు. అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, రుతురాజ్ జట్టుకు దూరమైతే.. సంజూ శాంసన్ ను ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకుని ఓపెనర్ గా పంపే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ 2022లో సంజూ శాంసన్ రాణించాడు. ఫస్ట్ టీ20లో సంజూని ఆడించకపోవడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయ్. దీంతో.. రెండో టీ20 అతన్ని ఆడించాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. మరో ఓపెనర్ గా ఇషాన్ కిషన్ కంటిన్యూ కానున్నాడు. ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ మ్యాచులో డకౌట్ తో విఫలమైన సూర్యకుమార్ యాదవ్ కి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో.. ఐపీఎల్ లో సత్తా చాటిన రాహుల్ త్రిపాఠికి మరో సారి నిరాశే ఎదురుకానుంది. హార్దిక్ పాండ్యా.. తన ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ గా కూడా సత్తా చాటాడు. దినేష్ కార్తీక్ ఫినిషర్ రోల్ ప్లే చేయనున్నాడు. టీమిండియా మేనేజ్ మెంట్ మదిలో కూడా దినేష్ కార్తీకే ఫినిషర్ అన్న భావన ఉంది.
భువనేశ్వర్ కుమార్ సారథ్యంలోని బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. అతనికి తోడుగా ఆవేశ్ ఖాన్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్, ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నాడు. తొలి మ్యాచ్‌లో భువీ, చాహల్ సత్తా చాటారు. ఒకే వికెట్ తీసినా.. పొదుపుగా బౌలింగ్ చేశారు.
అయితే.. ఐపీఎల్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్ ఫస్ట్ మ్యాచులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన ఉమ్రాన్.. ధారళంగా పరుగులిచ్చాడు. పసికూన బ్యాటర్లను అంతగా ఇబ్బంది పెట్టలేకపోయాడు. అతని బౌలింగ్‌లో రిథమ్ కూడా కనిపించలేదు. దీంతో, అతని స్థానంలో అర్ష దీప్ సింగ్ ను ఆడించే అవకాశం ఉంది.
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్నిర్నే(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లక్రాన్ టక్కర్(కీపర్), కర్టిస్ క్యాంపర్, ఆండీ మెక్‌బైన్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెకార్తీ, జోషువా లిటిల్
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.