INDvsENG: రహానే బదులు జడేజా వచ్చింది అందుకా? కామెంట్రీ బాక్సులో నవ్వులే నవ్వులు

రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందే రావడానికి కారణం అదా? (PC: BCCI)

భారత జట్టు కీలకమైన వికెట్లు కోల్పోయిన దశలో అజింక్యా రహానేకు బదులు రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇంతకు జడేజాకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఎందుకు వచ్చింది?

 • Share this:
  ఇండియా-ఇంగ్లాంగ్ (India Vs England) జట్ల మధ్య కీలకమైన 4వ టెస్టు (4th Test) ది ఓవల్ మైదానంలో (The Oval) గురువారం ప్రారంభమైంది. వాతావరణంతో పాటు పిచ్ కూడా అనుకూలించడంతో మరోసారి ఇంగ్లాండ్ (England) బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కెప్టెన్ జో రూట్‌కు కలసి వచ్చింది. హెడింగ్లే టెస్టులో ప్రదర్శించిన పేలవ ఫామ్‌నే టీమ్ ఇండియా (Team India) బ్యాట్స్‌మెన్ ఓవల్‌లో కూడా కొనసాగించారు. దీంతో తొలి సెషన్‌లోనే భారత జట్టు కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. నయావాల్ చతేశ్వర్ పుజార (Chateswar Pujara) అవుటైన తర్వాత అజింక్య రహానే బ్యాటింగ్‌కు రావాలి. కానీ ఆశ్చర్యకరంగా రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మైదానంలోకి వచ్చాడు. 7వ స్థానంలో రావాల్సిన జడేజా ఎందుకు ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చాడని అందరూ ఆశ్చర్యపోయారు. సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌ను అప్పటికప్పుడు మార్పులు చేస్తుంటారు. కానీ టెస్టు మ్యాచ్‌లలో ఇలా చేయడం చాలా అరుదు.

  టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ సాధించి ముందే వచ్చిన రవీంద్ర జడేజా గురించి ఆ సమయంలో కామెంటేటర్లు సునిల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ కారణాలను విశ్లేషిస్తున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో ఇంగ్లాండ్ బౌలర్లను డిస్ట్రబ్ చేయడానికే ఇలా పంపించి ఉంటారని కామెంటేటర్లు అన్నారు. అలా అయితే రిషబ్ పంత్‌నే పంపించి ఉండాల్సింది కదా మరి రవీంద్ర జడేజాను ఎందుకు పంపారని ఒకరు వ్యాఖ్యానించగా.. పంత్ ప్రస్తుతం ఫామ్‌లో లేడని.. అందుకే రవీంద్ర జడేజాకు ఆ అవకాశం దక్కిందని మరొకరు సమాధానం ఇచ్చారు. అయితే అదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ జరిగింది.

  అజింక్య రహానే ఆ సమయంలో బాత్రూంలో ఉన్నాడని.. అతడు బ్యాటింగ్ చేయడానికి సిద్దంగా లేకపోవడంతోనే రవీంద్ర జడేజాను పంపించారని వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు మొదలయ్యాయి. మొదటి నుంచి జడేజాపై వ్యతిరేక కామెంట్లు చేసే సంజయ్ మంజ్రేకర్ మరింతగా రెచ్చిపోయాడు. నిజమే.. అజింక్య రహానే సిద్దంగా లేడు.. అందుకే జడేజాను పంపించారు. ఇదేమీ గొప్ప టాక్టికల్ మూవ్ కాదని అన్నాడు. జడేజా రాణిస్తే గొప్ప మార్పు అని కీర్తిస్తారు. అదే అతడు విఫలమైతే మాత్రం విమర్శలు తప్పవని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. కానీ.. జడేజా కూడా ఆకట్టుకోలేక పోయాడు.

  టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టాపార్డర్ విఫలం అయిన సమయంలో కెప్టెన్ కోహ్లీ సమయోచితంగా ఆడి అర్దసెంచరీ సాధించాడు. కానీ అతడికి సరైన సహకారం లభించలేదు. 127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన సమయంలో శార్దుల్ ఠాకూర్ మెరుపు అర్దసెంచరీ చేశాడు. 7 ఫోర్లు 3 సిక్సులతో భారత జట్టును ఆదుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా 191 పరుగులు చేయగలిగింది.

  Paralympics: ఆమె ఒక్కతే 17 స్వర్ణ పతకాలు సాధించింది.. పారాలింపిక్స్‌లో ఆల్ టైం రికార్డు సృష్టించిన సారా స్టోరే

  Published by:John Naveen Kora
  First published: