• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • INDIA VS ENGLAND VIRAT KOHLI UNNECESSARILY HITS THE STUMPS TO HAND ENGLAND ANOTHER RUN NETIZENS BASHES SKIPPER FOR THIS SRD

Virat Kohli : కెప్టెన్ విరాట్ కోహ్లీ కోపం.. టీమిండియా చెల్లించక తప్పలేదు మూల్యం..

విరాట్ కోహ్లీ (Photo Credit : Twitter)

Virat Kohli : ఓటమితో టీ20 సిరీస్‌ను ఆరంభించిన భారత్ ఆదివారం మొతేరాలో జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది.

  • Share this:
    ఓటమితో టీ20 సిరీస్‌ను ఆరంభించిన భారత్ ఆదివారం మొతేరాలో జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మోర్గాన్ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ జేసన్ రాయ్‌ (46; 35 బంతుల్లో 4×4, 2×6) రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ (2/29), శార్దూల్‌ ఠాకూర్‌ (2/29) సత్తాచాటారు. ఛేదనలో విరాట్ కోహ్లీ (73 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 3×6), అరంగేట్ర ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్ (56; 32 బంతుల్లో 5×4, 4×6) అర్ధ శతకాలతో టీమిండియాకు విజయాన్ని అందించారు. భారత్‌ 3 వికెట్లు కోల్పోయిన 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో కోహ్లీ కోపం కారణంగా టీమిండియా ఒక అదనపు పరుగుని సమర్పించుకుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో.. ఇంగ్లాండ్ హిట్టర్ జానీ బెయిర్‌స్టో బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేశాడు. దాంతో.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ వేగంగా బంతి వద్దకి రావడంతో.. బెయిర్‌స్టో మొదట సింగిల్‌తో సరిపెట్టి.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉండిపోయాడు.

    కానీ.. శ్రేయాస్ నుంచి త్రో రూపంలో బంతిని అందుకున్న విరాట్ కోహ్లీ.. బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టో క్రీజులో ఉన్నప్పటికీ.. కోపంలో అనవసరంగా బెయిల్స్‌ని ఎగరగొట్టాడు. అయితే.. అదే సమయంలో అతని చేతి నుంచి బంతి చేజారి దూరంగా వెళ్లడంతో.. అదే అదనుగా రెండో పరుగు కోసం బెయిర్‌స్టో పరుగెత్తాడు. బెయిల్స్‌ని ఎగరగొట్టే సమయంలో విరాట్ కోహ్లీ చేతికి గాయమవగా.. బెయిర్‌స్టో రెండో పరుగు తీస్తున్న సమయంలో కోహ్లీ బంతి కోసం పరుగెత్తకుండా వికెట్ల వద్దే నిల్చొని నొప్పితో విలవిలలాడుతూ కనిపించాడు.








    అయితే, దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కోహ్లీ కోపం వల్లే ఒక పరుగు ఎక్స్ ట్రా వచ్చిందని.. దీని వల్ల మ్యాచ్ ఓడిపోయింటే ఏం చేసేవాడని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ కాస్త కోపం తగ్గించుకో..లేకపోతే ఇలాంటివి జరుగుతాయ్ అంటూ చురకలంటిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: