• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND VIRAT KOHLI LOSES COOL AFTER UMPIRES CALL OVER JOE ROOT A LIFELINE NETIZENS DEMAND TO BAN THIS SRD

India vs England : ఏంటీ అంపైర్ కాల్.. నిబంధనను మార్చండి..కోహ్లీ సీరియస్..

India vs England : ఏంటీ అంపైర్ కాల్.. నిబంధనను మార్చండి..కోహ్లీ సీరియస్..

ఏంటీ అంపైర్ కాల్.. నిబంధనను మార్చండి..కోహ్లీ సీరియస్..

India vs England : భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో విజయాల సంగతి పక్కన పెడితే.. అంపైరింగ్‌ అపహాస్యానికి గురవుతున్నట్లు అర్ధమవుతోంది. మ్యాచ్‌ తొలి రోజు నుంచి అంపైరింగ్ నిర్ణయాలపై రచ్చ నడుస్తోంది.

  • Share this:
    భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో విజయాల సంగతి పక్కన పెడితే.. అంపైరింగ్‌ అపహాస్యానికి గురవుతున్నట్లు అర్ధమవుతోంది. మ్యాచ్‌ తొలి రోజు నుంచి అంపైరింగ్ నిర్ణయాలపై రచ్చ నడుస్తోంది. ఫీల్డ్‌ అంపైర్‌ పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన థర్డ్‌ అంపైర్‌ కూడా అదే తప్పును రిపీట్‌ చేస్తే.. అది జట్టు జయాపజయాలపైనే కాకుండా అంపైరింగ్‌ వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. ముఖ్యంగా అంపైర్ కాల్ మరోసారి వివాదస్పదంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై విపరితమైన చర్చ సాగుతోంది. ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అంపైర్ కాల్ నిబంధనను రద్దు చేయండని నెటిజన్ల నుంచి డిమాండ్ లు వస్తున్నాయ్.ఇందుకు కారణం మాత్రం చెపాక్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు. ఈ టెస్టులో అంపైర్‌ కాల్ నిబంధన వల్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔట్ అవ్వగా.. ఇంగ్లండ్ సారథి జో రూట్ బతికిపోయాడు. అసలు విషయంలోకి వెళితే..రెండో ఇన్నింగ్స్‌ విరాట్ కోహ్లీ (62) స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయిన విషయం తెలిసిందే. మొదటగా అలీ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్‌ నితిన్ మీనన్ వేలెత్తేశాడు. కోహ్లీ సమీక్షకు వెళ్లగా.. అంపైర్‌ కాల్‌ నిబంధన కారణంగా అతడు ఔట్ అయ్యాడు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో జో రూట్‌ క్యాచ్‌ ఔట్‌ అంటూ భారత్‌ అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ నితిన్ మీనన్ నిరాకరించాడు. దీంతో కోహ్లీ సమీక్షకు వెళ్లాడు.

    రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని తేలింది. కానీ.. జో రూట్‌ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయినట్లు మాత్రం స్పష్టం అయింది. కానీ టీవీ అంపైర్‌ రూట్‌ను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించలేదు. ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు కాబట్టి అది 'అంపైర్‌ కాల్‌' అయింది. అక్షర్ పటేల్‌‌ బంతి వికెట్లను తాకేట్లున్నా.. అది ఆఫ్‌ స్టంప్‌ అవతలి లైన్‌లో పిచ్‌ కావడం వల్ల నిబంధనల ప్రకారం ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని టీవీ అంపైర్‌ మార్చలేకపోయాడు. ఒకవేళ రూట్‌ను అంపైర్‌ ఔట్‌గా ప్రకటించి ఉంటే.. అతను సమీక్ష కోరినా ఔట్ అయ్యేవాడు.








    ఈ విషయంపై విరాట్ కోహ్లీ కాసేపు ఫీల్డ్‌ అంపైర్‌తో వాదించినా ఫలితం లేకపోయింది. దీంతో కోహ్లీ నిరాశ చెందాడు. ఈ ఘటన మూడో రోజు చివరి ఓవర్లో జరిగింది. ఈ నేపథ్యంలో 'అంపైర్‌ కాల్‌' మరోసారి వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ సాగుతోంది. అంపైర్‌ కాల్ నిబంధనను రద్దు చేయండని నెటిజన్ల నుంచి డిమాండ్లు పెరిగిపోతున్నాయి. 'అంపైర్‌ కాల్'ను బ్యాన్ చేయండి అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. "అంపైర్‌ కాల్‌తో కోహ్లీ వికెట్ కోల్పోయాడు.. రూట్ బతికిపోయాడు. వెంటనే ఆ నిబంధనను రద్దు చేయండి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ లో టీమిండియా పట్టుబిగిస్తోంది. విజయం వైపు అడుగులు వేస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published: