• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND VIRAT KOHLI CONTINOUSLY LOSES TOSS 3RD ODI IS UNMISSABLE SA

India vs England: కోహ్లీ.. దరిద్రం అంటే నీదే.. 12 మ్యాచ్‌ల్లో 10 సార్లు ఓడిపోతావా!

India vs England: కోహ్లీ.. దరిద్రం అంటే నీదే.. 12 మ్యాచ్‌ల్లో 10 సార్లు ఓడిపోతావా!

Virat Kohli Loses Toss in 3rd ODI is Unmissable

విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడుతుంది. టాస్‌లు విరాట్‌కు కలిసి రావడం లేదు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ట్రై సిరీస్‌లో వరుసగా టాస్‌లు ఓడిపోతున్నాడు.

  • Share this:


    విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడుతుంది. టాస్‌లు విరాట్‌కు కలిసి రావడం లేదు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ట్రై సిరీస్‌లో వరుసగా టాస్‌లు ఓడిపోతున్నాడు. ఇప్పటి వరకు నాలుగు టెస్ట్‌లు, ఐదు టీ20లు, 3 వన్డేల్లో వేసిన 12 టాస్‌లో కేవలం రెండు సార్లు మాత్రమే విరాట్ గెలిచాడు. 10 సార్లు టాస్ ఓడిపోయాడు. గెలిచిన వాటిలో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్ట్‌, అహ్మదాబాద్‌లోని రెండో టీ20లో మాత్రమే ఉన్నాయి. ఆఖరి మూడో వన్డేలో కూడా టాస్ ఓటిమితోనే సిరీస్‌ను ముగించాడు.
    ఈ వన్డేలోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది.

    టాస్ అనంతరం మురళి కార్తిక్ మాట్లాడిన విరాట్ కోహ్లీ టాస్ గెలవడం ఏమాత్రం మన చేతిలో ఉండదు. టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుందామని అనుకున్నప్పటికి కుదరలేదని.. టెస్ట్, టీ20 సిరీస్‌ ద్వారా మళ్ళీ కమ్ బ్యాక్ చేశామన్నారు. ఈ మూడో వన్డే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది అన్నారు. ఈ సారి 30 నుంచి 40 పరుగులు వరకు ఎక్కువ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తేస్తామన్నారు. టాస్ ఓడినప్పటికి తాము చాలా మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ గెలిచమని చెప్పకోచ్చారు.

    విరాట్ కోహ్లీపై టాస్‌లు ఓడిపోవడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ భయ్యా దరిద్రం అంటే నీదే .. టాస్‌లు నీకు స్నేహితులు కానట్టు ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాస్ గురించి నెటిజన్స్ తీవ్రంగా చర్చ నడుస్తుంది.

    ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పు చేసింది. పూర్తి స్థాయిలో విఫలమైన కుల్దీప్ యాదవ్‌ స్థానంలో నటరాజన్ తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక కృనాల్‌ పాండ్యా‌కు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండడంతో టీమ్‌మేనేజ్‌మెంట్ మరోసారి అతనిపై నమ్మకం ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాను ఇంగ్లాండ్ బౌలర్లు దెబ్బ కొట్టారు. స్లో అండ్ స్టడీగా నడుస్తున్న భారత బ్యాటింగ్ లైన్‌ఫ్‌ను దెబ్బ తీశారు. 13 ఓవర్లకు టీమ్‌ఇండియా 92/0 పరుగులతో స్ట్రాంగ్‌గా కనిపించగా.. రషీద్‌ వరుసగా రెండు వికెట్లు తీసి దెబ్బ కోట్టాడు. గూగ్లీ రూపంలో వచ్చిన బంతిని హిట్‌మ్యాన్‌ డిఫెండ్‌ చేయలేక క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. రోహిత్‌ శర్మ (37; 37 బంతుల్లో 6×4) ఔటయ్యాడు. దీంతో టీమ్‌ఇండియా తొలి వికెట్‌ చేజార్చుకుంది. దీంతో భారత్ తొలి వికెట్‌ చేజార్చుకుంది. ఆ తర్వాత శిఖర్‌ ధావన్‌ వికెట్ తీశాడు. కాససేపటికే కోహ్లీ కెల్ ,రాహుల్ వికెట్లను భారత్ కోల్పోయింది.  ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న రిషబ్ పంత్ (68),హర్థిక్  పాండ్యా ((44)  దాటిగా ఆడుతున్నారు.
    Published by:Rekulapally Saichand
    First published: