INDIA VS ENGLAND VIRAT KOHLI AND ROHIT SHARMA ARE TRAINING TOGETHER FOR THE UPCOMING SERIES TWITTERATI CANT KEEP CALM SRD
India vs England : విరాట్ కోహ్లీ, రోహిత్ ల మధ్య గొడవలు లేవంటావా.? నెట్టింట మరో సారి రచ్చ..
కోహ్లీ - రోహిత్ (Photo Credit : Twitter)
India vs England : గత కొంతకాలంగా రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ మధ్య విబేధాలున్నాయని ప్రచారం జరిగింది. పరిస్థితులు కూడా అవి నిజమే అనుకునేలా చేశాయి. విరాట్ కోహ్లీ బర్త్‌డేకు రోహిత్ విషెస్ చెప్పకపోవడం, ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ ఎంపిక కాకపోవడం, ఆ తర్వాత ఎంపికైనా జట్టుతో ఆసీస్‌కు వెళ్లకపోవడం, అసలు రోహిత్ గురించి తనకేం తెలియదని విరాట్ మీడియా ముఖంగా చెప్పడం వీరి మధ్య విభేదాలు నిజమే అని చెప్పుకునేలా చేశాయి.
గత కొంతకాలంగా రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ మధ్య విబేధాలున్నాయని ప్రచారం జరిగింది. పరిస్థితులు కూడా అవి నిజమే అనుకునేలా చేశాయి. విరాట్ కోహ్లీ బర్త్‌డేకు రోహిత్ విషెస్ చెప్పకపోవడం, ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ ఎంపిక కాకపోవడం, ఆ తర్వాత ఎంపికైనా జట్టుతో ఆసీస్‌కు వెళ్లకపోవడం, అసలు రోహిత్ గురించి తనకేం తెలియదని విరాట్ మీడియా ముఖంగా చెప్పడం వీరి మధ్య విభేదాలు నిజమే అని చెప్పుకునేలా చేశాయి. గత ఏడాదిన్నరగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందన్న వాదన కూడా ఉంది. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపచంకప్ జట్టు ఎంపిక విషయంలో ఈ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయని, సెమీస్ ఓటమి అనంతరం మరింత బలపడ్డాయనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై టీమ్‌మేనేజ్‌మెంట్, విరాట్ కోహ్లీ స్వయంగా క్లారిటీ ఇచ్చినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య నెలకొన్న పరిస్థితులు కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. అయితే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు రోహిత్ ఎంపికవ్వగా.. పెటర్నిటీ లీవ్ తర్వాత విరాట్ జట్టులోకి వచ్చాడు. ఇక ఈ ఇద్దరు మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చారు. ఇద్దరూ కలిసే ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ సమక్షంలో క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పక్కపక్కనే ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రోహిత్-కోహ్లీ కలిసిపోయారంటూ అభిమానులు తెగ సంబరపడిపోగా మరికొందరూ ఫన్నీ కామెంట్లు చేశారు.
కోహ్లీ, రోహిత్ లు కలిసి ప్రాక్టీస్ చేసుకుంటున్నారని..కానీ వారి అభిమానులే సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే, ఈ ఇద్దరి మధ్య గొడవలు లేవంటావా? అయితే ఈ ఇద్దరు కౌగిలించుకున్న, మాట్లాడుకుంటున్న ఫొటోలు, వీడియోలు చూపించండని ఇంకొకరు సెటైరిక్‌గా కామెంట్ చేశారు. హమ్మయ్యా ఈ ఇద్దరు కలిసారన్నమాట.. భారత జట్టుకు డోకాలేదని ఇంకొంకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం విరాట్-రోహిత్ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
While Virat Kohli and Rohit Sharma are training together for the upcoming series, their fans are fighting here on social media. See how powerful that frame is.
జనవరి 11న విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ రోజు తండ్రైన విరాట్‌కు రోహిత్ శర్మ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపాడు. విరాట్ కోహ్లీ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన రోహిత్.. 'ఇది గొప్ప అనుభూతి. విరాట్ కోహ్లీ, అనుష్కశర్మకు అభినందనలు. ఆ దేవుడు చల్లగా చూడాలి'అని పేర్కొన్నాడు. అయితే హిట్ మ్యాన్‌కు కోహ్లీకి అభినందనలు తెలపడం చర్చనీయాంశమైంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.