• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • INDIA VS ENGLAND THE THIRD UMPIRES DECISION AGAINST SURYAKUMAR YADAV AFTER NOT FINDING CONCLUSIVE EVIDENCE CRICKETING WORLD DISAPPOINTED WITH THE DECISION SRD

India vs England : ఓయ్ థర్డ్ అంపైర్..కళ్లుకు గంతలు కట్టుకున్నావా ఏంటి..నెట్టింట్లో రచ్చ రచ్చ..

Photo Credit : Twitter

India vs England : ఇంగ్లండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన భారీ టార్గెట్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయ్.

  • Share this:
    ఇంగ్లండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన భారీ టార్గెట్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయ్. 31 బంతుల్లో ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే మలాన్ పట్టిన క్యాచ్‌, బంతి నేలను తాకినట్టు టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించింది.అయితే థర్డ్ అంపైర్ మాత్రం నిర్ణయం ప్రకటించడానికి చాలా సమయం తీసుకుని అవుట్‌గా ప్రకటించాడు. దీంతో వివాదాస్పద నిర్ణయం ప్రకటించిన థర్డ్ అంపైర్‌పై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. వీరేంద్ర సెహ్వాగ్, లక్ష్మణ్ లాంటి మాజీ క్రికెటర్లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని అంపైర్ నిర్ణయం ఇచ్చినట్టుగా సెహ్వాగ్ సెటైర్ వేశాడు. దీన్ని ఎలా ఔట్ ఇస్తారంటూ ట్విట్టర్ వేదికగా లక్ష్మణ్ ప్రశ్నించాడు.

    బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అవుట్‌గా ప్రకటించాడంటే, థర్డ్ అంపైర్ కళ్లకి ఆపరేషన్ చేయించాలి.... అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మనదేశంలో కాబట్టి అవుట్ ప్రకటించారు కానీ వేరే దేశంలో అంపైర్ అయినా ఇలా నేలపై తాకి వచ్చిన క్యాచ్‌గా అవుట్‌గా ప్రకటించేవారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అది మాత్రమే కాకుండా సుందర్ ఔట్ తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయ్. సుందర్ ది ఔట్ కాదని..సిక్స్ అని నెటిజన్లు థర్డ్ అంపైర్ పై విమర్శలు కురిపిస్తున్నారు.












    ఇక మ్యాచ్ లో అరంగేట్ర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(57) అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఓపెనర్లు, రోహిత్ శర్మ(12), కేఎల్ రాహుల్(14) వెంటవెంటనే అవుటైనా సూర్యకుమార్ యాదవ్ క్రీజులో పాతుకుపోయి చక్కగా ఆడాడు. కాగా.. గత మూడు మ్యాచ్‌లలో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్ ఈ మ్యచ్‌లో కూడా నిరాశపరిచాడు. కెప్టెన్ కోహ్లీ(1) కూడా అనవసరంగా భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంప్ అవుట్‌గా వెనుతిరిగాడు. స్కైకు రిషబ్ పంత్(30) చక్కగా సహకరించాడు. స్కై అవుటైన తరువాత క్రీజులోకొచ్చిన శ్రేయాస్ అయ్యర్(37) మొదట నెమ్మదిగా ఆడినా.. ఆ తరువాత బ్యాటు ఝుళిపించాడు. దీంతో 186 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది కోహ్లీసేన.
    Published by:Sridhar Reddy
    First published: