• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND TEAM INDIAS POOR FIELDING MAKES WORRIES IN MANAGEMENT SRD

Team India : క్యాచ్ లు ఇలా వదిలేస్తే ఎలా..భవిష్యత్తులో తప్పదు భారీ మూల్యం...

Team India : క్యాచ్ లు ఇలా వదిలేస్తే ఎలా..భవిష్యత్తులో తప్పదు భారీ మూల్యం...

Photo Credit : Twitter

Team India : క్రికెట్ లో క్యాచ్ లు మ్యాచ్ ల గెలుపోటముల్ని డిసైడ్ చేస్తాయ్. కానీ, నిన్న ఇంగ్లండ్ తో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఫీల్డింగ్ ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) లాంటి బెస్ట్ ఫీల్డరు కూడా రెండు క్యాచ్ లు చేజార్చాడు. చివరికి ఎలాగోలో గెలిచాం..కానీ, ఈ ఫీల్డింగ్ తప్పిదాల వల్ల అసలకే ఎసరు వచ్చేది.

  • Share this:
    క్యాచెస్‌ విన్ మ్యాచెస్ జెంటిల్ మేన్ గేమ్ లో ఎప్పుడూ వినిపించే మాట. క్యాచ్ లు మిస్ చేయడం వల్ల వరల్డ్ కప్ లు చేజార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయ్. 1999 ప్రపంచకప్‌ సెమీస్‌ ఇందుకు సరియైన ఉదాహరణ. ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ వా (Steve Waugh) క్యాచ్‌ను గిబ్స్‌ (Gibbs) విడిచిపెట్టడంతో దక్షిణాఫ్రికాకు ప్రపంచకప్పే దూరమైంది. ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతున్న టీమిండియా మాత్రం ఈ విషయం మర్చిపోయినట్టుంది. అత్యుత్తుమ ఫీల్డర్లున్న కోహ్లీసేన ఇంగ్లండ్ సిరీస్ లో పేలవ ఫీల్డింగ్ తో క్యాచ్ లు మీద క్యాచ్ లు చేజార్చి విమర్శలు ఎదుర్కొంటోంది. నిన్న మ్యాచ్ లో ఎలాగో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. లేకపోతే, మనోళ్ల చెత్త ఫీల్డింగ్ తో మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా చేజారేది. మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 329 పరుగులకి ఆలౌటవ్వగా..ఛేజింగ్ లో ఇంగ్లండ్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. భారత ఫీల్డర్ల మిస్టేక్స్ ను సొమ్ము చేసుకున్న యంగ్ ఆల్ రౌండర్ శామ్ కర్రన్ (Sam Curran) 95 పరుగులతో అజేయంగా నిలిచి ఆఖరి వరకూ టెన్షన్ పెట్టించాడు. వాస్తవానికి అతడు 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔటవ్వాల్సి ఉంది. ఇక, ఇన్నింగ్స్ 34 వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ బౌలింగ్ లో లాంగాఫ్ దిశగా సిక్స్ కోసం శామ్ ప్రయత్నించాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఆ క్యాచ్ ని మిస్ చేశాడు. అంతకు ముందు బెన్ స్టోక్స్ (Ben Stokes) క్యాచ్ ని హార్దిక్ పాండ్యా ఇలానే మిస్ చేశాడు. స్టోక్స్ భారీ స్కోరు చేయలేదు కానీ..లేకపోతే ఇది కూడా మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపేది.

    ఆ తర్వాత 49వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో శామ్ కరన్ బ్యాక్ టు బ్యాక్ క్యాచ్‌లు ఇచ్చాడు. కానీ.. సులువుగా అందుకోవాల్సిన క్యాచ్‌ని శార్ధూల్ ఠాకూర్ నేలపాలు చేయగా.. నటరాజన్‌ డైవ్ చేసే క్రమంలో బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో.. చివరి వరకూ శామ్ కర్రన్ నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా పేలవ ఫీల్డింగ్‌పై విరాట్ కోహ్లీ (Virat Kohli) మాట్లాడుతూ "మ్యాచ్‌లో శామ్ కరన్ క్యాచ్‌లు జారవిడచడం తీవ్ర నిరాశకి గురిచేసింది. ఒక్కోసారి ఈ తప్పిదాలకి భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది" అని హెచ్చరించాడు.

    ఇదే మ్యాచ్‌లో ఆదిల్ రషీద్ ఇచ్చిన క్యాచ్‌ని ఒంటిచేత్తో డైవ్ చేస్తూ కోహ్లీ అందుకోగా.. అంతకముందు బెన్‌స్టోక్స్ క్యాచ్‌నీ హార్దిక్ పాండ్యా జారవిడిచాడు. ఇంగ్లండ్ సిరీస్ లో ఎలాగో నెగ్గొకొచ్చిన భారత్‌.. ఫీల్డింగ్‌ను సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ ఏడాది కీలక టీ-20 వరల్డ్ కప్ ఉంది. ఇలా, క్యాచ్ లు విడిచిపెడితే..అసలకే ఎసరు వచ్చే ఛాన్స్ ఉంది. కోహ్లీ, జడేజా, రోహిత్ లాంటి ఆటగాళ్ల ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యున్నత ప్రమాణాలు నిర్దేశించిన భారత జట్టు మునుపెన్నడూ లేనంత చెత్త ఫీల్డింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటోంది.
    Published by:Sridhar Reddy
    First published: