• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND TEAM INDIAS GLORIOUS UNBEATEN HOME RUN OF 13 TEST SERIES WINS SA

స్పిన్‌ ఉచ్చులో బిగించి ఘోర పరాభవాల్ని రుచి చూపింది

స్పిన్‌ ఉచ్చులో బిగించి ఘోర  పరాభవాల్ని రుచి చూపింది

virat kohli

అభిమానుల అంచనాలను ఏమాత్రం తలక్రిందులు చేయకుండా పటిష్టమైన వ్యూహంతో ముందకు వెళ్ళింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ముగిసిన చివరి మ్యాచ్‌లో భారత్‌.

  • Share this:
    మెుదటి టెస్ట్‌లో ఓడిన.. తర్వాత బెబ్బులిలా విజృంభించింది. మిగితా టెస్ట్‌లో పకడ్బంది వ్యూహాంతో ముందుకు వెళ్ళి సిరీస్‌ను 3-1తో విజయం సాధించింది. ప్రత్యర్థి బలహీనతపై దృష్టి పెట్టి స్పి్న్ మయాజాలంతో ఆదరగొట్టింది. మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగించెస్తే.. ఇక నాలుగో టెస్టు మూడు రోజుల్లో ఖతం చేసింది. ఈ విజయంలో స్పిన్నర్లు అశ్విన్, అక్షర్‌ పటేల్‌ కీలక పాత్ర పోషించారు. వీరికి స్పిన్ దాటికి ఇంగ్లండ్‌ దాసోహం అయింది. టెస్ట్ సిరీస్‌లో డామినేషన్ అంతా వీరిద్దరిదే..

    అభిమానుల అంచనాలను ఏమాత్రం తలక్రిందులు చేయకుండా పటిష్టమైన వ్యూహంతో ముందకు వెళ్ళింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ముగిసిన చివరి మ్యాచ్‌లో భారత్‌.. ఇంగ్లాండ్‌ను 25 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. నాలుగు టెస్ట్ సిరీస్‌లో 3-1తో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌ను టీమిండియా స్పీన్నర్లు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్ల దాటికి తట్టుకోలేక కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్‌‌లో 25 పరుగులకు ఇంగ్లాండ్‌ దూరంగా నిలిచింది.

    ఇక ఈ గెలుపుతో టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్తాండ్ మెుదటి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు అలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన టీమిండియా 365 పరుగులు చేసింది.
    దీంతో భారత్ 160 పరుగుల అధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ 160 పరుగుల అధిక్యాన్ని సమం చేయలేక 135 పరుగులకే చాపచూట్టేసింది. భారత్ బౌలర్లు అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ చేరో ఐదు వికెట్ల తీసి ఇంగ్లాండ్‌ను చావు దెబ్బ తీశారు. ఇక ఇంగ్లాండ్‌ ఇన్నింగ్ప్‌లో డేనియెల్‌ లారెన్స్‌ (50), జో రూట్‌ (30) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఈ గెలుపుతో ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జూన్‌లో లార్డ్స్‌ మైదనంలో న్యూజిలాండ్‌తో ఫైనల్లో ఆడనుంది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు