Home /News /sports /

INDIA VS ENGLAND TEAM INDIA STARTS PRACTICE AND VIRAT KOHLI HITS THE NETS FOR THE FIRST TIME IN CHENNAI SHARES VIDEO SRD

India vs England : చెన్నైలో టీమిండియా ప్రాక్టీస్ షురూ.. కోహ్లీ ఇరగదీశాడుగా...

Photo Credit : Instagram

Photo Credit : Instagram

India vs England : ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటిన టీమిండియా మరో రసవత్తర సమయానికి రెడీ అయింది. రాబోయే టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల క్వారంటైన్ ముగిసింది. మరోవైపు కరోనా పరీక్షల్లో టీమిండియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికి నెగటివ్ వచ్చింది. దీంతో ప్రాక్టీస్ సెషన్లు ప్రారంభించాయ్ రెండు జట్లు.

ఇంకా చదవండి ...
    ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటిన టీమిండియా మరో రసవత్తర సమయానికి రెడీ అయింది. రాబోయే టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల క్వారంటైన్ ముగిసింది. మరోవైపు కరోనా పరీక్షల్లో టీమిండియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికి నెగటివ్ వచ్చింది. దీంతో ప్రాక్టీస్ సెషన్లు ప్రారంభించాయ్ రెండు జట్లు. చెన్నై చెపాక్‌ స్టేడియంలో కోహ్లీసేన నెట్‌ ప్రాక్టీస్‌ షురూ చేసింది. ఆరు రోజుల క్వారంటైన్‌ అనంతరం కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో సోమవారమే ఔట్‌డోర్‌ సెషన్‌కు దిగిన భారత ఆటగాళ్లు.. మంగళవారం తొలి నెట్‌ సెషన్‌లో చెమటోడ్చారు. ముందుగా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ప్లేయర్లందరికి దిశానిర్దేశం చేశాడు. కసరత్తుల అనంతరం ఆటగాళ్లు ఫుట్‌బాల్‌ ఆడారు. ఇక పెటర్నిటీ లీవ్ తో ఆసీస్ సిరీస్ లో చివరి మూడు టెస్ట్ లకు అందుబాటులో లేని కోహ్లీ.. ప్రాక్టీస్ లో ఇరగదీశాడు. తనదైన రేంజ్ షాట్లు ఆడాడు. ఫ్లిక్, కవర్ డ్రైవ్ షాట్లతో అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. తలదించుకుని కష్టపడి పనిచేయాలంటూ దానికి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి క్యాచులు ప్రాక్టీస్ చేశాడు. ఇద్దరూ పక్కపక్కనే నిల్చొని సాధన చేశారు. ఆపై అందరూ కలిసి రన్నింగ్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ ఆధ్వర్యంలో ఆటగాళ్లు సాధన చేశారు. కోహ్లీ, పంత్, పుజారా, రహానే, రోహిత్ బ్యాటింగ్ చేయగా.. సిరాజ్, ఇషాంత్, బుమ్రా, అశ్విన్ బౌలింగ్ చేశారు.

    వ్యక్తిగత కారణాల వల్ల క్వారంటైన్‌లోకి ఓ రోజు ఆలస్యంగా వచ్చిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బుధవారం జట్టుతో కలువనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి వచ్చిన పాండ్యా బౌలింగ్‌లోనూ పాలుపంచుకొని.. తుది జట్టులోని ఇద్దరు పేసర్లపై పడే భారాన్ని తగ్గించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అయితే 2019లో వెన్ను సర్జరీ చేయించుకున్న పాండ్యా మళ్లీ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తాడో లేదో చూడాలి.








    View this post on Instagram






    A post shared by Virat Kohli (@virat.kohli)









    గాయం కారణంగా ఆసీస్‌ టూర్‌కు పూర్తిగా దూరమైన సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ప్రాక్టీస్‌లో చురుగ్గా పాల్గొనడం టీమిండియాకు ఊరట కలిగించే అంశం. ఆస్ట్రేలియా పర్యటనని జనవరిలో విజయవంతంగా ముగించిన టీమిండియా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో గెలిచింది. మరోవైపు శ్రీలంక పర్యటనలో పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించి ఇంగ్లాండ్ టీమ్.. రెండు టెస్టుల సిరీస్‌ని 2-0తో గెలిచింది. దీంతో ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్ ఆసక్తికరంగా ఉండనుంది. మరోవైపు టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కీలకమవడంతో సొంతగడ్డపై ఇంగ్లిష్‌ జట్టును చిత్తుచేయాలని కోహ్లీసేన పట్టుదలగా ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: England, Kohli, Rohit sharma, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు