Virat Kohli : ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా మరో సమరానికి రెడీ అవుతోంది. వచ్చే నెల 5 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ కూడా అక్కడే జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై చేరుకొని క్వారంటైన్లో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా తో ఫస్ట్ టెస్ట్ తర్వాత మిగతా సిరీస్ కు దూరమైన విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించనున్నాడు.
ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా మరో సమరానికి రెడీ అవుతోంది. వచ్చే నెల 5 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ కూడా అక్కడే జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై చేరుకొని క్వారంటైన్లో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా తో ఫస్ట్ టెస్ట్ తర్వాత మిగతా సిరీస్ కు దూరమైన విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించనున్నాడు. పితృత్వపు సెలవుల మీద టీమిండియాకు తిరిగొచ్చిన కోహ్లీ.. ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నాడు. క్వారంటైన్ లో ఉన్న కోహ్లీ..ఇక రూమ్ లో ఖాళీగా కూర్చోకుండా తన ఫిట్ నెస్ కు పదును పెడుతున్నాడు. హోటల్ రూంలోని జిమ్ లో చెమట చిందిస్తున్నాడు కెప్టెన్ కోహ్లీ. చెమట చిందిస్తోన్న వీడియోను కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశాడు. " క్వారంటైన్ రోజుల్లో ప్రోఫిసి మ్యూజిక్, జిమ్ పరికరాలు ఉంటే చాలు. ఇక రెచ్చిపోవచ్చు" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.మరోవైపు టీమిండియా కెప్టెన్సీ విభజన మళ్లీ తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో.. తొలి టెస్టు తర్వాత పెటర్నటీ లీవ్‌పై విరాట్ కోహ్లీ భారత్‌కి వచ్చేయగా.. మిగిలిన మూడు టెస్టుల్లోనూ టీమిండియాని కెప్టెన్‌గా అజింక్య రహానె సమర్థంగా నడిపించాడు.
దీంతో.. టెస్టు కెప్టెన్సీ బాధ్యతల్ని రహానెకి అప్పగించి.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీని వన్డే, టీ20లకే పరిమితం చేయాలనే డిమాండ్లు మాజీ క్రికెటర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు కెప్టెన్సీ విభజన కారణంగా సాధిస్తున్న ఫలితాల్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇంగ్లాండ్ వన్డే, టీ20 జట్లకి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌కాగా.. టెస్టుల్లో జో రూట్ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆస్ట్రేలియాని కూడా టీ20, వన్డేల్లో అరోన్ ఫించ్ నడిపిస్తుండగా.. టెస్టులకి టిమ్ పైనీ కెప్టెన్‌గా ఉన్నాడు.
కెప్టెన్సీ విభజనపై ఇటీవల అజింక్య రహానె అభిప్రాయం కోరగా.. ఎప్పటికీ మా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని అతను చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తమ ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉందని చెప్పుకొచ్చి రహానె.. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇప్పటికీ తనని స్లిప్‌లో నమ్మకంగా ఫీల్డింగ్ కోసం కోహ్లీ ఉంచుతున్న విషయాన్ని గుర్తు చేశాడు. ఇక లెజండరీ ప్లేయర్ కపిల్ దేవ్ కూడా మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ టీమిండియాను విజయవంతంగా నడిపిస్తున్నాడని.. అందుకు రోహిత్, రహానే సహకరిస్తున్నారని తెలిపాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.