• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND STAR OPENER ROHIT SHARMA SLAMS PITCH CRITICS AND DEFENDS HOME ADVANTAGE SRD

Rohit Sharma : అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే... ఏ..? పిచ్‌లపై విమర్శకులకు రోహిత్ కౌంటర్

Rohit Sharma : అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే... ఏ..? పిచ్‌లపై విమర్శకులకు రోహిత్ కౌంటర్

Rohit Sharma

Rohit Sharma : టీమిండియా-ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పిచ్ లపై ఎక్కువ చర్చ నడుస్తోంది. టీమిండియా స్పిన్నింగ్ ట్రాక్ లు రెడీ చేసుకుని..విజయాలు సాధిస్తోందంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు తమ నోళ్లకు పని చెప్పారు. వీటికి మన మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ కౌంటరిచ్చారు. అయితే, తాజాగా పిచ్ లపై స్పందించాడు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.

  • Share this:
    టీమిండియా-ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పిచ్ లపై ఎక్కువ చర్చ నడుస్తోంది. టీమిండియా స్పిన్నింగ్ ట్రాక్ లు రెడీ చేసుకుని..విజయాలు సాధిస్తోందంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు తమ నోళ్లకు పని చెప్పారు. వీటికి మన మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ కౌంటరిచ్చారు. అయితే, తాజాగా పిచ్ లపై స్పందించాడు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.పిచ్‌ల గురించి అనవసరంగా రచ్చ చేస్తున్నారని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. దీనికి బదులు ఆటగాళ్లు, వారి ప్రదర్శనలపై చర్చించాలని విశ్లేషకులు, అభిమానులకు ఈ టీమిండియా ఓపెనర్‌ సూచించాడు. రెండు జట్లకు పిచ్‌ సమానమేనని.. మెరుగ్గా ఆడినవాళ్లే గెలుస్తారని తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. సెకండ్ టెస్ట్ పిచ్‌పై వచ్చిన విమర్శలపై స్పందించాడు. రోహిత్‌ వీడియోనూ బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. " పిచ్‌ అనేది ఇరు జట్లకు సమానంగానే ఉంటుంది. ఇప్పుడు కాదు కొన్ని సంవత్సాలు నుంచే టీమిండియాలో అన్ని పిచ్‌లను ఒకేరకంగా తయారు చేస్తున్నారు. భారత్‌లో ఇంతకముందు జరిగిన టెస్టు సిరీస్‌లు కూడా ఇవే పిచ్‌లపై జరిగాయి. అప్పుడు రాని చర్చలు ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి.. దీనిపై ఇంత డిబేట్‌ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. పిచ్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అయినా ఏ జట్టైనా తమ సొంత గ్రౌండ్‌లు తమకే అనుకూలంగా ఉండాలని భావిస్తాయి." అని తెలిపాడు.

    "ఇదే పరిస్థితి మాకు బయట ఎదురవుతుంది. మేం ఇటీవలే ఆసీస్‌ పర్యటనకు వెళ్లి వచ్చాం. మరి ఆసీస్‌ జట్టు వారి సొంతగడ్డపై ఉన్న మైదానాలకు అనుకూలంగా తయారుచేసుకోలేదా.. మేం వారితో పోరాడి సిరీస్‌ గెలవలేదా? మేం బయటికి వెళ్లి ఆడినప్పుడు వారు మా గురించి పట్టించుకోరు.. ఇప్పుడు అంతే.. వేరే జట్టు మన దేశానికి వచ్చినప్పుడు ఎందుకు పట్టించుకుంటాం. హోం అడ్వాంటేజ్‌ అనే పదం వినిపించకూడదంటే ఇకపై అవన్నీ తీసేసి ఆడితే బాగుంటుంది. దీనిపై ఐసీసీతో చర్చించండి.. ఆ రూల్‌ వచ్చేలా చేయండి. ఇంతటితో దీనికి విరామిస్తే బాగుంటుంది. అయినా పిచ్‌పై అనవసర చర్చను పక్కనపెట్టి మ్యాచ్‌లు, ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది." అని చెప్పుకొచ్చాడు.


    అయితే, రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సూపర సెంచరీతో ఆకట్టుకున్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ సెంచరీతో పాటు బౌలింగ్‌లోనూ 9వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మ్యాచ్‌ను గెలిపించాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. ఇక, ఇరు జట్ల మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీన జరగనుంది. ఈ టెస్ట్ పింక్ బాల్ తో జరగనుంది.
    Published by:Sridhar Reddy
    First published: