• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND SKIPPER VIRAT KOHLI SAYS PERFECT GAME FOR US AND HE REJECTS CRITICISM OF CHENNAI PITCH FACTOR SRD

India vs England : మా విజయ రహస్యం ఇదే..ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన కోహ్లీ..

India vs England : మా విజయ రహస్యం ఇదే..ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన కోహ్లీ..

Virat Kohli

India vs England : ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత ఇంగ్లండ్‌కు 482 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించిన టీమిండియా.. ఆపై రూట్‌ సేనను రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూల్చి ఘనమైన గెలుపును అందుకుంది.

  • Share this:
    ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత ఇంగ్లండ్‌కు 482 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించిన టీమిండియా.. ఆపై రూట్‌ సేనను రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూల్చి ఘనమైన గెలుపును అందుకుంది. ఇది టీమిండియా టెస్టు చరిత్రలో ఐదో పెద్ద విజయంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉంచితే, స్పిన్-ఫ్రెండ్లీ పిచ్‌ అంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు చేస్తున్న విమర్శలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిప్పికొట్టాడు. స్పిన్ పిచ్ కారణంగానే తాము గెలిచామనడంలో ఎలాంటి అర్థం లేదని, టాస్ కూడా కీలకమైనట్లు తాను ఏ మాత్రం భావించడం లేదన్నాడు. ఇరు జట్లకు ఒకే పరిస్థితులు ఎదురయ్యాయని, తాము సమష్టిగా రాణించి అద్భుత విజయాన్నందుకున్నామని స్పష్టం చేశాడు. మ్యాచ్ లో విక్టరీ తర్వాత మాట్లాడిన విరాట్.. అభిమానుల సమక్షంలో ఈ మ్యాచ్ జరగడం తమ జట్టుకు ఎంతో లాభించిందని, వారి ప్రోత్సాహం, అరుపుల వల్లే తమలో ఉత్సాహం ఉరకలెత్తిందని చెప్పాడు. ఈ బిగ్ విక్టరీ రహస్యం కూడా అదేనన్నాడు. ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుందని విరాట్ చెప్పుకొచ్చాడు.

    "స్వదేశంలో ప్రేక్షకుల్లేకుండా ఫస్ట్ టెస్ట్ ఆడటం చాలా వింతగా అనిపించింది. నిజాయితీగా చెప్పాలంటే తొలి రెండు రోజులు మా శక్తీ సామర్థ్యాలను బయటకు తీయలేకపోయాం. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌ నుంచి అదరగొట్టాం. ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తుంది. ఈ మ్యాచ్ దానికి ఉదహారణగా నిలుస్తోంది. ఇక చెన్నై అభిమానులకు క్రికెట్‌పై మంచి అవగాహన ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రతీ బౌలర్‌కు బౌలింగ్ చేసే 10-15 నిమిషాల ముందు ప్రేక్షకుల నుంచి మద్దతు అవసరం. ఈ వేడి వాతావారణంలో నేను బౌలింగ్ చేయాలన్నా నాకు వారి ప్రోత్సాహం కావాల్సిందే. " అంటూ కోహ్లీ తెలిపాడు.

    మరోవైపు ఈ విజయంతో భారత్ ICC వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి దూసుకెళ్లింది కోహ్లీసేన. చెన్నైలో ఇంగ్లండ్ పై గెలిచి 4 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసిన టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఇంగ్లండ్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి చేరింది.
    Published by:Sridhar Reddy
    First published: