IND vs ENG 2nd Semi Final : హార్దిక్ పాండ్యా (Hardik Pandya), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు టీమిండియా (Team India) పాలిట మరోసారి అపద్భాంధవులుగా నిలిచారు. ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ (14) ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. అయితే హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (40 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. ముఖ్యంగా హార్దిక్ చివర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దాంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగుల చేసింది. క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ సాధించారు.
ఓపెనర్లు విఫలం
టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ కు దిగగా మరోసారి ఓపెనర్లు రాహుల్ (5), రోహిత్ శర్మ (28 బంతుల్లో 27) భారత్ కు శుభారంభం అందించలేకపోయారు. గత మ్యాచ్ రెండు మ్యాచ్ ల్లో అర్ధ సెంచరీలు చేసిన రాహుల్ వోక్స్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్ లో ఉన్న రోహిత్ అడపాదడపా బౌండరీలు సాధించాడు. అయితే జోర్డాన్ బౌలింగ్ లో కరణ్ కు క్యాచ్ ఇచ్చి అవుటైయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ ను ఆదిల్ రషీద్ బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 75 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో జట్టును హార్దిక్, కోహ్లీ ఆదుకున్నారు. వీరిద్దరూ చివర్లో ధాటిగా ఆడుతూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత వెంటనే పెవిలియన్ కు చేరాడు. ఇక చివరి ఓవర్లలో పాండ్యా బౌండరీల వర్షం కురిపించాడు. పంత్ (6) మరోసారి నిరాశ పరిచాడు. అయితే పాండ్యా మాత్రం ఒంటరి పోరాటం చేసి జట్టుకు పరుగులు సాధించి పెట్టాడు. చవరి మూడు ఓవర్లలో 15, 20, 12 పరుగులతో మొత్తంగా 47 పరుగులు సాధించాడు. అయితే చివరి బాల్ ను ఫోర్ బాదిన పాండ్యా కాలు వికెట్లను తాకడంతో హిట్ వికెట్ గా పెవిలియన్ కు చేరాడు.
తుది జట్లు :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్
ఇంగ్లండ్ : అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, ఫిల్ సాల్ట్, సామ్ కర్రన్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs england, Rohit sharma, Surya Kumar Yadav, T20 World Cup 2022, Team India, Virat kohli