IND vs ENG : టి20 ప్రపంచకప్ (T20 World cup) 2022లో టీమిండియా (Team India) ఆట ముగిసింది. అందరూ ఊహించినట్లు భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఫైనల్ జరగడం లేదు. ఇంగ్లండ్ (England)తో జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ చిత్తు చిత్తుగా ఓడింది. భారత్ పై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. 15 ఏళ్ల నిరీక్షణకు తెర దించాలని ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత్ మరోసారి నిరాశగా ఇంటిదారి పట్టింది. ఈ నెల 13న జరిగే ఫైనల్లో ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసి నెగ్గింది. అలెక్స్ హేల్స్ (47 బంతుల్లో 86 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), జాస్ బట్లర్ (49 బంతుల్లో 80 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చెమట పట్టకుండా ఛేజ్ ని పూర్తి చేశారు.
ఓపెనర్లే ముగించేశారు
అడిలైడ్ పై 169 పరుగులు ఛేజ్ చేయడం అంటే మరీ అంత సులభం కాదు. కానీ, ఇంగ్లండ్ ఓపెనర్లు దానిని చెమట పట్టకుండా కంప్లీట్ చేశారు. తొలి ఓవర్ నుంచే అలెక్స్ హేల్స్, బట్లర్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా అలెక్స్ హేల్స్ భారత బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఇక మొదట్లో నెమ్మదిగా ఆడిన జాస్ బట్లర్ ఆ తర్వాత రెచ్చిపోయడు. వీరిద్దరూ వారిలో వారు పోటీ పడుతూ పరుగులు సాధించారు. ఇక భారత బౌలర్లు ఒక్క ఓవర్ లోనూ వికెట్లు తీసేలా కనిపించలేదు. వచ్చిన ఒక్క అవకాశాన్ని సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ డ్రాప్ చేశాడు. టి20 వరల్డ్ కప్ లలో ఇంగ్లండ్ కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగుల చేసింది. హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (40 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు, క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ సాధించారు. ఆరంభంలో భారత్ వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. దాంతో టీమిండియా 75 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హార్దిక్, విరాట్ కోహ్లీలు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ చివర్లో ధాటిగా ఆడుతూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత వెంటనే పెవిలియన్ కు చేరాడు. ఇక చివరి ఓవర్లలో పాండ్యా బౌండరీల వర్షం కురిపించాడు. పంత్ (6) మరోసారి నిరాశ పరిచాడు. అయితే పాండ్యా మాత్రం ఒంటరి పోరాటం చేసి జట్టుకు పరుగులు సాధించి పెట్టాడు. చవరి మూడు ఓవర్లలో 15, 20, 12 పరుగులతో మొత్తంగా 47 పరుగులు సాధించాడు. అయితే చివరి బాల్ ను ఫోర్ బాదిన పాండ్యా కాలు వికెట్లను తాకడంతో హిట్ వికెట్ గా పెవిలియన్ కు చేరాడు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs england, KL Rahul, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli