Rohit Sharma : నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన టీమిండియా.. సుమారు ఏడాది తర్వాత జరుగుతున్న టెస్ట్ తొలి రోజే పూర్తిగా నిరాశపర్చింది. కెరీర్ లో అయితే, టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మైదానంలో నవ్వులు పూయించాడు.
నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన టీమిండియా.. సుమారు ఏడాది తర్వాత జరుగుతున్న టెస్ట్ తొలి రోజే పూర్తిగా నిరాశపర్చింది. కెరీర్ లో 100 వ టెస్ట్ ఆడుతున్న కెప్టెన్ జో రూట్ సెంచరీ చేయడంతో తొలి రోజు పూర్తిగా ఇంగ్లండ్ పై చేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. అయితే, టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మైదానంలో నవ్వులు పూయించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో అతను హెల్మెట్ పెట్టుకొని సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. రోహిత్ ఇలా చేయడాన్ని చూసిన భారత ఆటగాళ్లు తొలుత ఆశ్చర్యానికి గురైనా, ఆతరువాత రోహిత్ ప్రవర్తనను చూసి ముసి ముసిగా నవ్వుకున్నారు. థర్డ్ స్లిప్‌లో ఉన్న రహానే, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లు అయితే ఆ ఓవర్ మొత్తం నవ్వుతూ కనిపించారు. అయితే రోహిత్ ఇలా హెల్మెట్ పెట్టుకొని స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడానికి ఓ కారణం ఉంది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో జో రూట్ డిఫెన్స్ ఆడుతున్న సందర్భంలో బంతి గాల్లోకి లేచి రోహిత్‌కు ముందు కొద్ది దూరంలో పడింది. దీంతో అతను షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ నుంచి హెల్మెట్ తీసుకుని కొద్దిగా ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇది చూసి భారత క్రికెటర్లతో సహా గ్రౌండ్లో ఉన్నవారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు.
రోహిత్ ఇలా చేయడంపై భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సెటైరికల్ మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులను ఏదో విధంగా హిట్ మ్యాన్ అలరిస్తూనే ఉంటాడని ఒకరు కామెంట్ చేయగా.. కుదిరితే బ్యాట్ లేకుంటే మైదానంలో తన సరదా పనులతో రోహిత్ అలరిస్తాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. రోహిత్ ఉంటే జట్టులో ఫన్ ఉంటుందని, ఆటగాళ్లను ఉత్తేజపరచడానికి ఇలాంటి పనులు చేస్తుంటాడని మరొకరు కామెంట్ చేశారు. హెల్మెట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేస్తున్న ఫొటోతో ఫన్నీ మీమ్స్ ట్రేండ్ చేస్తున్నారు.
అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుత శతకం(128 నాటౌట్) సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. బుమ్రా రెండు వికెట్లు తీయగా..అశ్విన్ ఒక వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.