Home /News /sports /

INDIA VS ENGLAND ROHIT SHARMA SLAPS WICKET KEEPER RISHABH PANT ON HIS HEAD VIDEO GOES VIRAL SRD

India vs England : రిషభ్ పంత్ డిప్ప మీద ఒక్కటేసిన రోహిత్ శర్మ.. వైరల్ వీడియో

రిషభ్ పంత్ డిప్ప మీద ఒక్కటేసిన రోహిత్ శర్మ.. వైరల్ వీడియో

రిషభ్ పంత్ డిప్ప మీద ఒక్కటేసిన రోహిత్ శర్మ.. వైరల్ వీడియో

India vs England : చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా పట్టు బిగించింది. అశ్విన్ స్పిన్ ట్రాప్ కి ఇంగ్లీష్ టీమ్ బెంబేలెత్తింది. ఫస్ట్ టెస్ట్ ఓటమి నుంచి త్వరగా తేరుకున్న కోహ్లీసేన.. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో లెక్క సరిచేసే దిశగా దూసుకెళ్తుంది. అయితే ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ..

ఇంకా చదవండి ...
    చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా పట్టు బిగించింది. అశ్విన్ స్పిన్ ట్రాప్ కి ఇంగ్లీష్ టీమ్ బెంబేలెత్తింది. ఫస్ట్ టెస్ట్ ఓటమి నుంచి త్వరగా తేరుకున్న కోహ్లీసేన.. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో లెక్క సరిచేసే దిశగా దూసుకెళ్తుంది. అయితే ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. సహచర ఆటగాడు, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ డిప్ప మీద ఒక్కటేసాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 50 ఓవర్‌ అశ్విన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ టేయిలెండర్ ఓలీ స్టోన్.. రోహిత్ శర్మ‌కు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆటగాళ్లంతా రోహిత్ శర్మను అభినందించగా.. అతని దగ్గరకు వచ్చిన రిషభ్ పంత్ నెత్తిపై రోహిత్ ఒక్కటేసాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక కోహ్లీ సేన బౌలింగ్‌కు తలవంచిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ (107 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు) ఒక్కడే కొంత పోరాడాడు. అశ్విన్‌ (5/43) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లోనూ పర్వాలేదనిపిస్తుంది.

    సెకండ్ టెస్ట్ మూడో రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 54/1తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు.. పుజారా(7), రోహిత్ శర్మ (26), రిషభ్ పంత్ (8), అజింక్య రహానె (10), అక్షర్ పటేల్(7) వికెట్లను వరుసగా కోల్పోయింది. 106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రవిచంద్రన్ అశ్విన్(61 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(62) ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.


    విరాట్ కోహ్లీ, కుల్దీప్, ఇషాంత్ శర్మ ఔటైనా...మహ్మద్ సిరాజ్ సాయంతో అశ్విన్ పోరాడుతున్నాడు. ఈ టీమిండియా ఆఫ్ స్పిన్నర్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 455 పరుగుల ఆధిక్యంలో ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: India vs england, Rishabh Pant, Rohit sharma

    తదుపరి వార్తలు