INDIA VS ENGLAND ROHIT SHARMA HAILS ASHWIN AXAR PATEL FOR MOTERA HEROICS SA
పిచ్‌పై దెయ్యాలేం లేవు.. ఇంగ్లాండ్లానే భారత్ కూడా తప్పులు చేసింది
rohith sharma
మూడో టెస్ట్‌లో భారత్ విజయంపై టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ టెస్టులో పిచ్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని.. కష్టతరం కానీ బంతులకే చాలా మంది బ్యాట్స్‌మెన్ ఔటయ్యారన్నారు.
మూడో టెస్ట్‌లో భారత్ విజయంపై టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ టెస్టులో పిచ్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని.. కష్టతరం కానీ బంతులకే చాలా మంది బ్యాట్స్‌మెన్ ఔటయ్యారన్నారు. మ్యాచ్ తర్వాత మీడియా మాట్లాడిన రోహిత్ మ్యాచ్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. " ఇంగ్లాండ్ ఆటగాళ్లే కాకుండా భారత్ బ్యాట్స్‌మెన్స్ కూడా కొన్ని పోరపాట్లు చేశారని తెలిపారు. అందుకు నిదర్శనంగా తొలి ఇన్నింగ్స్‌లో తమ ఆటతీరే అన్నారు. పిచ్‌ను సరిగ్గానే ఉందని.. దానిపై ఏం అదృశ్య శక్తులేం లేవన్నారు. ఒక్కసారి పిచ్‌ను 6అర్ధం చేసుకుంటే ఈజీగానే పరుగులు చేయొచ్చన్నారు.
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న డై/నైట్ టెస్ట్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది కోహ్లీసేన. రోహిత్ శర్మ 25 పరుగులు చేయగా..శుభ్ మన్ గిల్ 14 రన్స్ చేశాడు. 49 పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన టీమిండియా ఈజీగా ఛేజ్ చేసింది. ఈ విక్టరీతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ విక్టరీతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో అడుగుపెట్టేందుకు టీమిండియా దగ్గరైంది. మరోవైపు ఈ ఓటమి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి నాకౌటైంది జో రూట్ సేన. ఇక మూడో టెస్ట్ వచ్చే నెల నాలుగు నుంచి ఇదే వేదికగా జరగనుంది. అంతకుముందు, టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ అల్లాడిపోయారు.
33 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 81 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 49 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. భారత బౌలింగ్‌లో అక్షర్ పటేల్(5/32) ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ (4/48) నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌటైంది. 99/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. కేవలం 46 పరుగుల మాత్రమే జోడించింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐదు వికెట్లు తీసి కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.