రిషబ్‌ పంత్‌ రివర్స్‌ స్కూప్.. ఆశ్చర్యపోయిన ఆర్చర్‌ (video)

రిషబ్‌ పంత్‌ రివర్స్‌ స్కూప్.. ఆశ్చర్యపోయిన ఆర్చర్‌ (video)

యువ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ రివర్స్‌ స్కూప్‌ షాట్స్‌కు మంచి అదరణ లభిస్తోంది. నాలుగో టెస్టులో అండర్సన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌ ఆడిన రిషబ్ మరోసారి అదే షాట్ ఆడి అభిమానులు అలరించారు.

 • Share this:
  యువ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ రివర్స్‌ స్కూప్‌ షాట్స్‌కు మంచి అదరణ లభిస్తోంది. నాలుగో టెస్టులో అండర్సన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌ ఆడిన రిషబ్ మరోసారి అదే షాట్ ఆడి అభిమానులు అలరించారు. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ వేసిన మెరుపు బంతిని పంత్ కొంచెం పక్కకు జరిగి రివర్స్‌ స్కూప్‌తో సిక్స్‌ బాదేశాడు. ఈ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేగంతో దూసుకువచ్చిన బంతిని బ్యాట్‌‌తో థర్డ్‌మ్యాన్‌ మీదుగా కొట్టగా అది స్టాండ్స్‌లో పడింది. ఈ షాట్‌ను చూసిన అభిమానులు, ఆర్చర్‌ ఆశ్చర్యపోయారు.

  అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో జరుగుతున్న ఫస్ట్ టీ-20 లో టీమిండియా ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ టీమ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 125 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఓపెనర్లు జాసన్ రాయ్, జోస్ బట్లర్ లు సూపర్ స్టార్ట్ అందించారు. ఫస్ట్ వికెట్ కు వీరిద్దరూ 72 పరుగుల పార్టనర్ షిప్ ను నమోదు చేశారు. జాసన్ రాయ్ 32 బంతుల్లో 49 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.

  టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 20 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోర్ రెండు పరుగుల వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ (1) ఔట్ అయ్యాడు. పేసర్ జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. సుదీర్ఘకాలం తర్వాత టీమిండియా తరఫున మ్యాచ్‌ ఆడుతున్న రాహుల్‌.. తొలి టీ20లో పూర్తిగా నిరాశపరిచాడు. ‌ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్రిస్ జోర్డాన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరిన కాసేపటికే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (4) మార్క్‌వుడ్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. ఆపై శ్రేయస్ అయ్యర్ అండతో రిషబ్ పంత్ బ్యాట్ జుళిపించాడు. కొన్ని మంచి షాట్లు ఆడాడు. ఆరంభం నుంచే దూకుడుగా కనిపించిన పంత్‌.. 10 ఓవర్‌లో పెవిలియన్‌ చేరాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో డీప్‌ స్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న జానీ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భారమంతా శ్రేయస్ అయ్యర్‌పైనే పడింది. హార్దిక్ పాండ్యా అండతో అయ్యర్ జట్టు స్కోరును ముందుకు నడిపాడు.
  Published by:Rekulapally Saichand
  First published: