India vs England : నెహ్రా ఆటోగ్రాఫ్ తీసుకుంటే స్టార్లయిపోతారంతే..అప్పుడు కోహ్లీ..ఇప్పుడు పంత్..

నెహ్రా ఆటోగ్రాఫ్ తీసుకుంటే స్టార్లయిపోతారంతే..అప్పుడు కోహ్లీ..ఇప్పుడు పంత్.. (Twitter)

India vs England : టీమిండియా విధ్వంసకర ఆటగాడు రిషబ్‌ పంత్‌కు చెందిన ఓ పాత ఫోటోగ్రాఫ్‌ వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో పంత్‌ భారత మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా ఆటోగ్రాఫ్‌ తీసుకుంటూ కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

  • Share this:
    టీమిండియా విధ్వంసకర ఆటగాడు రిషబ్‌ పంత్‌కు చెందిన ఓ పాత ఫోటోగ్రాఫ్‌ వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో పంత్‌ భారత మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా ఆటోగ్రాఫ్‌ తీసుకుంటూ కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. గతంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా అచ్చం ఇలానే ఆశిష్‌ నెహ్రాతో ఆటోగ్రాఫ్‌ తీసుకుంటూ కనిపించాడు. ఈ రెండు ఫోటోలను పోలుస్తూ సోషల్‌ మీడియాలో పెద్ద డిస్కషనే నడుస్తోంది. కోహ్లి, పంత్‌ల సక్సెస్‌కు నెహ్రా ఆటోగ్రాఫే కారణమని కొందరంటుంటే.. మరి కొందరేమో నెహ్రా హస్తవాసి చాలా బాగుందని.. ఆయన ఆటోగ్రాఫ్‌ తీసుకుంటే క్రికెటర్లు స్టార్లయిపోతారని కామెంట్లు చేస్తున్నారు.. ఆశిష్ నెహ్రా ఆటోగ్రాఫ్‌కు అంత పవరుందా? గతంలో కోహ్లీ సూపర్ స్టార్ అయ్యాడు.. ఇప్పుడు పంత్ అదరగొడుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.కోహ్లీ, పంత్‌ల సక్సెస్‌కు నెహ్రా ఆటోగ్రాఫే కారణమని కొందరంటుంటే.. మరి కొందరేమో నెహ్రా హస్తవాసి చాలా బాగుందని.. ఆయన ఆటోగ్రాఫ్‌ తీసుకుంటే క్రికెటర్లు స్టార్లయిపోతారని కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ ముగ్గురు క్రికెటర్లు దేశవాళి క్రికెట్‌లో ఢిల్లీ జట్టకే ప్రాతినిధ్యం వహించారు.

    ఇంగ్లండ్‌తో శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో సెంచరీతో కదంతొక్కిన పంత్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతని పేరు నెట్టింట మారుమోగుతోంది.





    ఇక, ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ టీమిండియా 3-1 తో కైవసం చేసుకుంది. ఈ నెల 12 నుంచి రెండు జట్లు పొట్టి ఫార్మాట్ లో తలపడనున్నాయ్. మరోవైపు, ఈ టెస్ట్ సిరీస్ విక్టరీతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు దూసుకెళ్లింది భారత్. లార్డ్స్ లో జరిగే ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది కోహ్లీసేన.
    Published by:Sridhar Reddy
    First published: