• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND PINK TEST LIVE SCORE TEAM INDIA SCORES 99 FOR 3 BEFORE STUMPS ON DAY 1 SRD

India vs England : ముగిసిన తొలి రోజు ఆట..స్పిన్నర్లదే ఆధిపత్యం..కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా

India vs England : ముగిసిన తొలి రోజు ఆట..స్పిన్నర్లదే ఆధిపత్యం..కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా

India vs England (Photo Credit : BCCI Twitter)

India vs England : భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియాదే పై చేయి గా కన్పిస్తోంది.

  • Share this:
    భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియాదే పై చేయి గా కన్పిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ, రహానే ఉన్నారు. ఆట ముగిసే సమయానికి కోహ్లీ వికెట్ కోల్పోవడం టీమిండియాకు మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మరోవైపు, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్ ఒక వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రేపు రోహిత్ మీదే టీమిండియా భారం. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు పూర్తిగా తేలి పోయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 112 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లను తమ స్పిన్ మాయజాలంతో బెంబెలేత్తించారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ స్పిన్ దెబ్బకి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ వెంటనే వెంటనే పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ జాక్ క్రాలీ(53) అర్థశతకం మినహా.. మిగతా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలం అయ్యారు. భీకరమైన్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ సారథి జో రూట్(17) కూడా నిరాశపరిచాడు. లోకల్ బాయ్ అక్షర్ పటేల్ ఆరు వికెట్లతో సత్తా చాటాడు. అశ్విన్ మూడు వికెట్లు తీయగా..ఇషాంత్ ఒక వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

    టాస్ నెగ్గి బ్యాటింగ్‌ ప్రారంభించిన కాసేపటికే ఇంగ్లండ్‌కు షాక్‌ తగిలింది. ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లే ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరాడు.
    మరికొద్ది సేపటికే రెండో వికెట్‌ కోల్పోయింది. అయితే, క్రీజులో కుదురుకున్న క్రాలే బౌండరీల మోత మోగించాడు. దీంతో ఇంగ్లీష్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో అక్షర్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది 67 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. అతడి కెరీర్‌లో ఇది నాలుగో ఫిఫ్టీ. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని స్పిన్నర్ ఆర్ అశ్విన్ విడదీశాడు. రూట్ (17) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఊపు మీదున్న క్రాలే ని అక్షర్ ఎల్బీగా పెవిలియన్ కు పంపాడు. దీంతో టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రూట్ సేన. ఇక టీ విరామం తర్వాత కూడా టీమిండియా బౌలర్లు రెచ్చిపోవడంతో ఇంగ్లండ్ 112 పరుగులకే ఆలౌటైంది.


    ఆ తర్వాత టీమిండియా తన ఇన్నింగ్స్ ను బాగానే ఆరంభించింది. రోహిత్ శర్మ చూడచక్కని షాట్లతో అలరించాడు. అయితే, ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డ గిల్ జట్టు స్కోరు 33 పరుగుల వద్ద ఆర్చర్ బౌలింగ్ లో ఔటై పెవిలియన్ బాట పట్టాడు. అయితే, ఆ వెంటనే పుజారా కూడా జాక్ లీచ్ బౌలింగ్ లో డకౌటవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడ్డట్టు కన్పించింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి రోహిత్ టీమిండియా ఇన్నింగ్స్ ను చక్క దిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు హిట్ మ్యాన్. ఈ జోడి మూడో వికెట్ కు 64 పరుగుల పార్టనర్ షిప్ ను నెలకొల్పింది. అయితే, ఆఖర్లో లేని షాట్ కు వెళ్లి.. లీచ్ బౌలింగ్ లో ఔటయ్యాడు కోహ్లీ. దీంతో టీమిండియా ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు