INDIA VS ENGLAND PINK TEST DAY 2 LIVE SCORE RAVICHANDRAN ASWIN ENTERS INTO 400 WICKET CLUB WITH ARCHER WICKET SRD
India vs England : 400 వికెట్ల క్లబ్ లోకి రవిచంద్రన్ అశ్విన్.. ఆర్చర్ వికెట్ తో చరిత్ర..
రవిచంద్రన్ అశ్విన్
India vs England : నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న డై/నైట్ టెస్ట్‌లో టీమిండియా రెచ్చిపోయింది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ అల్లాడిపోయారు.
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న డై/నైట్ టెస్ట్‌లో టీమిండియా రెచ్చిపోయింది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ అల్లాడిపోయారు. టీమిండియా ను తక్కువ స్కోరుకు కట్టడి చేసిన ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 81 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా టార్గెట్ 49 పరుగులు. ఇక, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో 400 వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ 400 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. కాగా ఇంతకముందు టెస్టుల్లో టీమిండియా తరపున ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో అనిల్ కుంబ్లే(619), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417) మాత్రమే ఉన్నారు.దీంతో పాటు అశ్విన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన తొలి టీమిండియా ఆటగాడిగా.. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
What a champion bowler 🔝😎
4️⃣0️⃣0️⃣ Test wickets for @ashwinravi99 and we're sure there's still many more to come 👌🏻🤗
400 వికెట్ల తీయడానికి అశ్విన్‌కు 77 టెస్టులు అవసరమవగా.. లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ మాత్రం 72 టెస్టుల్లోనే 400 వికెట్ల ఫీట్‌ను సాధించి తొలి స్థానంలో నిలిచాడు.అశ్విన్ తీసిన వికెట్లలో సగం ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌వే కావడం గమనార్హం. 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతణ్ని అభినందిస్తూ అనిల్ కుంబ్లే, లక్ష్మణ్ తదితర మాజీ క్రికెటర్లు ట్వీట్లు చేస్తున్నారు.