• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND PINK TEST DAY 2 LIVE SCORE KOHLIS TEAM TARGET 49 RUNS SPINNERS PUT TEAM INDIA ON TOP SRD

India vs England : టీమిండియా స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ ఢమాల్..కోహ్లీసేన టార్గెట్ ఎంతంటే..

India vs England : టీమిండియా స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ ఢమాల్..కోహ్లీసేన టార్గెట్ ఎంతంటే..

భారత్-ఇంగ్లండ్ (Photo Credit : Twitter)

India vs England : నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న డై/నైట్ టెస్ట్‌లో టీమిండియా రెచ్చిపోయింది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ అల్లాడిపోయారు.

  • Share this:
    నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న డై/నైట్ టెస్ట్‌లో టీమిండియా రెచ్చిపోయింది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ అల్లాడిపోయారు. టీమిండియా ను తక్కువ స్కోరుకు కట్టడి చేసిన ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 81 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా టార్గెట్ 49 పరుగులు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా లీడ్ 33 పరుగులు. దీంతో 49 పరుగులు చేస్తే ఈ మ్యాచ్ ను టీమిండియా కైవసం చేసుకుంటోంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లు, అశ్విన్ 4 వికెట్లు తీశారు. సుందర్ ఒక వికెట్ తీశాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లో స్టోక్స్ చేసిన 25 పరుగులే అత్యధికం. ఇక, తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌట్ అయింది. 99/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో గురువారం రెండో రోజు ఆటను కొనసాగించిన కోహ్లీసేన వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ దెబ్బకి టీమిండియా 145 పరుగులకే ఆలౌటైంది. కేవలం 33 పరుగుల ఆధిక్యం మాత్రమే సంపాందించింది కోహ్లీసేన. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే(25 బంతుల్లో 7), రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్(8 బంతుల్లో 1), సుందర్(0), అక్షర్ పటేల్(0) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 11 పరుగుల వ్యవధిలోనే భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది.

    రహానే, రోహిత్‌లను తన వరుస ఓవర్లలో జాక్ లీచ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. రిషభ్ పంత్‌, వాషింగ్టన్ సుందర్‌(0), అక్షర్ పటేల్‌లను ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ వెనక్కి పంపాడు. రోహిత్ శర్మ రివ్యూ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. జాక్ లీచ్ వేసిన 41 ఓవర్‌ తొలి బంతిని స్వీప్ షాట్ ఆడబోయిన రోహిత్ అంచనా తప్పింది. దాంతో బంతి బ్యాట్‌ను మిస్సై శరీరానికి తాకింది. ఎల్బీ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. రోహిత్ సమీక్షకు వెళ్లగా అంపైర్స్ కాల్‌గా తేలింది. దాంతో హిట్ మ్యాన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత్ టప టపా వికెట్లు కోల్పోయింది.


    జోరూట్ బౌలింగ్‌లో పంత్‌ కీపర్ క్యాచ్‌‌గా.. వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత కొంచెం సేపు అశ్విన్ తన బ్యాట్ కు పని చెప్పాడు. 17 పరుగులు చేసిన అశ్విన్ కూడా జో రూట్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆఖర్లో ఇషాంత్ శర్మ పది పరుగులు చేశాడు. ఇక ఆఖరి వికెట్ గా బుమ్రా జో రూట్ బౌలింగ్ లో ఔటయ్యాడు. జో రూట్ తన కెరీర్ లో మొదటి సారిగా ఐదు వికెట్లను తీశాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు