Home /News /sports /

INDIA VS ENGLAND ODI SERIES WATCH HOW TEAM INDIA FORMER CAPTAIN VIRAT KOHLI OFFERS CHAMPAGNE TO RAVI SHASTRI SJN

Team India : భారత ప్లేయర్ల సంబరాలు మామూలుగా లేవుగా.. చుక్కేస్తావా అంటూ మాజీ కోచ్ కు ఆఫర్ ఇచ్చిన కోహ్లీ

PC : TWITTER

PC : TWITTER

Team India : ఇంగ్లండ్ (England)తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ (India) 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సిరీస్ విజేతను తేల్చే చివరిదైన మూడో వన్డేలో రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోని టీమిండియా (Team India) ప్రత్యర్థి ఇంగ్లండ్ పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఇంకా చదవండి ...
Team India : ఇంగ్లండ్ (England)తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ (India) 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సిరీస్ విజేతను తేల్చే చివరిదైన మూడో వన్డేలో రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోని టీమిండియా (Team India) ప్రత్యర్థి ఇంగ్లండ్ పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రిషభ్ పంత్ వీరోచిత సెంచరీ (113 బంతుల్లో 125 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో జట్టుకు విజయాన్ని అందించాడు. పంత్ కు తోడు హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 71; 10 ఫోర్లు) అర్ధ శతకంతో చెలరేగాడు. ఫలితంగా 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే నష్టపోయి 261 పరుగులు చేసి గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. టెస్టు మ్యాచ్ ఓటమి తర్వాత పుంజుకున్న భారత్ అటు టి20, ఇటు వన్డే సిరీస్ లను సొంతం చేసుకుని ఇంగ్లండ్ పర్యటనను ముగించింది.

ఇది కూడా చదవండి : ఇంగ్లండ్ పాలిట అసలైన విలన్ ఇతడే.. మూడు చెరువుల నీళ్లు తాగించేశాడుగా!

ఇక వన్డే ట్రోఫీ అందుకునే సమయంలో శిఖర్ ధావన్, రిషభ్ పంత్, విరాట్ కోహ్లీ చేసిన హంగామా మామూలుగా లేదు. క్రీడా రంగంలో విజయాన్ని షాంపేన్ ను చిందిస్తూ జరుపుకోవడం ఆనవాయితీ. వన్డే ట్రోఫీతో టీం దగ్గరకు రోహిత్ శర్మ రాగా.. ధావన్, పంత్ లు అతడిపై షాంపేన్ ను చల్లాడు. ట్రోఫీని వయసులో చిన్న ప్లేయర్ అయిన అర్ష్ దీప్ కు అందించి ధోని మొదలు పెట్టిన ఆచారాన్ని రోహిత్ కొనసాగించాడు.




ఇక షాంపేన్ ను పొంగించిన తర్వాత.. అక్కడే సిరీస్ పై విశ్లేషణ ఇస్తున్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రికి షాంపేన్ ను ఆఫర్ చేశాడు కోహ్లీ. పంత్ రవిశాస్త్రి దగ్గరకు వెళ్లి మరీ ఇచ్చి రావడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. జాస్ బట్లర్ (80 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు ఓపెనర్ జేసన్ రాయ్ (41), మొయిన్ అలీ (34), ఓవర్టన్ (32) పోరాడటంతో ఇంగ్లండ్ 250 మార్కును దాటగలిగింది. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. యుజువేంద్ర చహల్ 3 వికెట్లు తీయగా.. మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో రాణించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hardik Pandya, India vs england, Mohammed Shami, Mohammed Siraj, Ravi Shastri, Rishabh Pant, Rohit sharma, Shikhar Dhawan, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు