INDIA VS ENGLAND NETIZENS COUNTER PUNCH TO KEVIN PIETERSEN FOR DOWNPLAYING KOHLIS TEAM MASSIVE WIN SRD
India vs England : భారత్ విజయంపై ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ సెటైర్లు..బర్నాల్ రాసుకో అంటూ నెటిజన్లు కౌంటర్..
India vs England
India vs England : ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత ఇంగ్లండ్‌కు 482 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించిన టీమిండియా.. ఆపై రూట్ సేనను రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూల్చి ఘనమైన గెలుపును అందుకుంది.
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత ఇంగ్లండ్‌కు 482 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించిన టీమిండియా.. ఆపై రూట్ సేనను రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూల్చి ఘనమైన గెలుపును అందుకుంది. ఇది టీమిండియా టెస్టు చరిత్రలో ఐదో పెద్ద విజయంగా రికార్డులకెక్కింది. అయితే ఈ విజయాన్ని ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ఆధిపత్యాన్ని ఏ మాత్రం సహించలేకపోతున్నారు. ఇప్పటికే పిచ్‌ను నిందిస్తూ భారత ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువ చేసి మాట్లాడిన ఈ ఇంగ్లీష్ మాజీ ఆటగాళ్లు.. మ్యాచ్ తర్వాత కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ భారత విజయాన్ని ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ బీ టీమ్‌పై భారత్ విజయం సాధించిందని పేర్కొన్నాడు. ఓవైపు భారత్‌ను అంటూనే మరోవైపు ఇంగ్లండ్ టీమ్ సెలెక్షన్‌ను తప్పుబట్టాడు. భారత్.. ఇంగ్లండ్ పూర్తి స్థాయి జట్టుపై గెలవలేదని చెప్పకనే చెప్పాడు. "ఇంగ్లండ్ బీ టీమ్‌పై విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు" అని హిందీలో ట్వీట్ చేశాడు. ఇక సెకండ్ టెస్ట్‌కు గాయంతో జోఫ్రా ఆర్చర్ దూరం కాగా.. రొటేషన్ పాలసీలో భాగంగా జేమ్స్ అండర్సన్, జోస్ బట్లర్‌కు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.
ఇక పీటర్సన్ ట్వీట్‌పై భారత అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ జట్టుపై గెలిచినా.. గెలుపు గెలుపేనని, పూర్తి స్థాయి జట్టుతో ఆడకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నిస్తున్నారు. తమ బీ టీమ్ ఇంకా బలంగా ఉంటుందని, ఆస్ట్రేలియా ఫలితాన్ని మరిచిపోయావా? అని చురకలేస్తున్నారు. ఓటమికి సాకులు చెప్పడం మాని.. తదుపరి మ్యాచ్‌కైనా సంసిద్దం కావాలని సూచిస్తున్నారు. ఇంకొంతమందైతే.. బర్నాల్ రాసుకోమని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం కెవిన్ పీటర్సన్ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
మరోవైపు, స్పిన్-ఫ్రెండ్లీ పిచ్ అంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు చేస్తున్న విమర్శలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిప్పికొట్టాడు. స్పిన్ పిచ్ కారణంగానే తాము గెలిచామనడంలో ఎలాంటి అర్థం లేదని, టాస్ కూడా కీలకమైనట్లు తాను ఏ మాత్రం భావించడం లేదన్నాడు. ఇరు జట్లకు ఒకే పరిస్థితులు ఎదురయ్యాయని, తాము సమష్టిగా రాణించి అద్భుత విజయాన్నందుకున్నామని స్పష్టం చేశాడు. మ్యాచ్ లో విక్టరీ తర్వాత మాట్లాడిన విరాట్.. అభిమానుల సమక్షంలో ఈ మ్యాచ్ జరగడం తమ జట్టుకు ఎంతో లాభించిందని, వారి ప్రోత్సాహం, అరుపుల వల్లే తమలో ఉత్సాహం ఉరకలెత్తిందని చెప్పాడు. ఈ బిగ్ విక్టరీ రహస్యం కూడా అదేనన్నాడు. ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుందని విరాట్ చెప్పుకొచ్చాడు.