• HOME
 • »
 • NEWS
 • »
 • SPORTS
 • »
 • INDIA VS ENGLAND MOHAMMED SIRAJS WHOLESOME REACTION TO ASHWINS CENTURY WIN HEARTS OF NETIZENS VIDEO GOES VIRAL SRD

India vs England : అశ్విన్ సెంచరీ...సిరాజ్ సెలెబ్రేషన్స్..ఫ్యాన్స్ మనస్సు దోచుకున్న హైదరాబాదీ..వైరల్ వీడియో

India vs England : అశ్విన్ సెంచరీ...సిరాజ్ సెలెబ్రేషన్స్..ఫ్యాన్స్ మనస్సు దోచుకున్న హైదరాబాదీ..వైరల్ వీడియో

India vs England

India vs England : చెన్నై టెస్ట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా విజయం వైపు అడుగులు వేస్తోంది. విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచింది కోహ్లీ సేన. అయితే, టీమిండియా ఇంత పటిష్టమైన స్థితిలో ఉండటానికి ముఖ్య కారణం అశ్విన్. తన ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు ఈ చెన్నై ప్లేయర్. అయితే, నిన్న సెంచరీ చేసింది అశ్విన్ అయితే.. అభిమానుల మనస్సు దోచుకుంది మాత్రం మన హైదరాబాదీ సిరాజ్.

 • Share this:
  చెన్నై టెస్ట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా విజయం వైపు అడుగులు వేస్తోంది. విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచింది కోహ్లీ సేన. అయితే, టీమిండియా ఇంత పటిష్టమైన స్థితిలో ఉండటానికి ముఖ్య కారణం అశ్విన్. తన ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు ఈ చెన్నై ప్లేయర్. అయితే, నిన్న సెంచరీ చేసింది అశ్విన్ అయితే.. అభిమానుల మనస్సు దోచుకుంది మాత్రం మన హైదరాబాదీ సిరాజ్. ఆస్ట్రేలియా పర్యటనలో సూపర్ ఫెర్ఫామెన్స్‌తో సత్తా చాటిన ఈ హైదరాబాద్ గల్లీ బాయ్.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో‌నూ తనదైన ఆటతో అదరగొడుతూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. స్వదేశంలో ఫస్ట్ టెస్ట్ ఆడుతున్న సిరాజ్.. తన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే వికెట్ తీసి ఔరా అనిపించాడు. ఇక మూడో రోజు ఆటలో ఆఖరి వికెట్‌‌కు బ్యాటింగ్‌కు దిగిన ఈ హైదరాబాద్ స్టార్.. క్రీజులో నిలిచి అశ్విన్ సెంచరీ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అశ్విన్ సెంచరీ పూర్తయిన వెంటనే ఎగిరి గంతేశాడు. సహచరుడి సెంచరీ తనదే అన్నట్లుగా సిరాజ్ సెలెబ్రేట్ చేసుకోవడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని అసాధారణ పోరాటానికి అభిమానులంతా ఫిదా అయ్యారు. శభాష్ సిరాజ్ అంటూ కొనియాడుతున్నారు. సహచరుడి ఘనతను ఆస్వాదించే గొప్ప మనసు నీదంటూ మెచ్చుకుంటున్నారు. ఇక సిరాజ్ క్రీజులోకి వచ్చే సమయానికి అశ్విన్ 80 పరుగుల వద్ద ఉన్నాడు. దాంతో అతని సెంచరీ అసాధ్యమేనని అంతా భావించారు. కానీ సిరాజ్ 15 బంతులను డిఫెన్స్ చేసి తన సహచరుడి సెంచరీకి సాయం చేశాడు.

  ఈ క్రమంలో అతను ఎదుర్కొనే ప్రతి బంతికి ప్రేక్షకుల నుంచి భారీ మద్దతు లభించింది. అరుపులు, చప్పట్లతో చెపాక్ దద్దరల్లింది. ఇక అశ్విన్ సెంచరీ పూర్తవ్వగానే తనలోని హిట్టర్‌ను నిద్రలేపిన సిరాజ్.. రెండు భారీ సిక్సర్లు కొట్టి అందర్ని ఆశ్చర్యపరిచాడు. తనకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉందని ఇంగ్లండ్ బౌలర్లకు చెప్పకనే చెప్పాడు. ఇక సిరాజ్ సూపర్ బ్యాటింగ్‌కు కామెంటేటర్లు కూడా అవాక్కయ్యారు. సూపర్ బ్యాటింగ్ అంటూ కొనియాడారు. తాను ఏమాత్రం టెయిలెండర్ కాడని, ఫించ్ హిట్టరని కొనియాడారు. హైదరాబాద్ దమ్ బిర్యాని దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడని ప్రశంసించారు. చివరకు అశ్వినే క్లీన్ బౌల్డ్ కాగా.. సిరాజ్ అజేయంగా నిలిచాడు. ఈ ఇద్దరు ఆఖరి వికెట్‌కు 49 పరుగులు జోడించడం విశేషం.


  ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా సిరాజ్ క్రీడా స్పూర్తి చాటి యావత్ క్రికెట్ ప్రపంచం మన్ననలు అందుకున్న విషయం తెలిసిందే. గులాబీ సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్‌ గ్రీన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. భారత బ్యాట్స్‌మన్ జస్‌ప్రీత్ బుమ్రా కొట్టినా షాట్ నేరుగా గ్రీన్ ముఖానికి తగిలింది. దాంతో గ్రీన్ కుప్పకూలగా.. నాన్‌స్ట్రైకర్‌‌గా ఉన్న సిరాజ్‌ పరుగు పూర్తి చేయకుండా నేరుగా గ్రీన్ దగ్గరకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. పరుగు కన్నా అతని గాయానికే ప్రాధాన్యత ఇచ్చి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. ఇప్పుడు తన సహచరుడి సెంచరీని కూడా అద్భుత రితీలో సెలబ్రేడ్ చేసుకుని మరోసారి అభిమానుల్లో హీరో అయ్యాడు సిరాజ్.
  Published by:Sridhar Reddy
  First published:

  అగ్ర కథనాలు