INDIA VS ENGLAND MICHAEL VAUGHANS CRITICISM OF THE MOTERA PITCH HAS FOUND A NEW DIMENSION IN HIS MUST WATCH PITCH REPORT SRD
India vs England : వార్నీ నీ దుంప తెగ..పిచ్‌ను పట్టుకునే వేలాడుతున్న మైకేల్ వాన్..ఈ సారి వీడియోతో రచ్చ..
మైకేల్ వాన్ (Photo Credit : Instagram)
India vs England : మొతేరాలో టీమిండియా విజయంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. అది టెస్ట్ మ్యాచ్ నిర్వహించే పిచ్ కాదని.. అసలే మూడు టెస్ట్‌లో విజయం ఎవరిది కాదన్నాడు.
మొతేరాలో టీమిండియా విజయంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. అది టెస్ట్ మ్యాచ్ నిర్వహించే పిచ్ కాదని.. అసలే మూడు టెస్ట్‌లో విజయం ఎవరిది కాదన్నాడు. భారత్ ఎలాంటి విధానాన్ని అవలభించిన ఐసీసీ మాత్రం అభ్యంతరం చెప్పడం లేదని విమర్శించాడు. మరోవైపు, పిచ్ పై నిందలు ఆపి బ్యాటింగ్ పై దృష్టి సారించాలని క్రికెట్ దిగ్గజాలు సూచించినా..పేస్ పిచ్ లపై బ్యాట్స్ మెన్ విఫలమైనప్పుడు లేవని నోళ్లు కొంచెం స్పిన్ అయితే ఏడ్చి చస్తున్నారని స్టార్ స్పిన్నర్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నా..ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ మాత్రం తన విమర్శలను ఆపడం లేదు. అసలు ఆ పిచ్ టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదని ఘాటుగా విమర్శించిన వాన్.. ఇలాంటి పిచ్‌లను తయారు చేస్తే మూడు ఇన్నింగ్స్‌లు ఆడేలా నిబంధనలు తీసుకురావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతటితో ఆగకుండా ఇదే మైదానం వేదికగా గురువారం నుంచి జరగనున్న నాలుగో టెస్టుకు ఇలాంటి పిచ్‌నే తయారు చేస్తున్నారని, పొలం దున్నినట్లు పిచ్‌ను నాగలితో దున్నుతున్నారని సెటైర్లు పేల్చాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా రైతు పొలం దున్నుతున్న ఫొటోను పంచుకున్నాడు.
ఇప్పుడు మరోసారి అహ్మదాబాద్ పిచ్‌ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. మంగళవారం మొతేరా పిచ్‌ను దున్నిన పొలంతో పోలుస్తూ బ్యాటింగ్ చేస్తున్నట్లుగా స్టిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వాన్ మరో వీడియోతో ముందుకు వచ్చాడు. ఈసారి పిచ్ రిపోర్ట్‌ను అందిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. ''పిచ్ కండీషన్ సూపర్‌గా ఉంది.. టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ వారి సొంతం.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు.
అయితే వాన్‌ను మాత్రం నెటిజన్లు ఒక రేంజ్లో ఆడుకున్నారు. వాన్ ఇక నువ్వు మారవా.. ఇంగ్లండ్, టీమిండియాలు మూడో టెస్టును మరిచిపోయి నాలుగో టెస్టుకు సిద్ధమవుతున్నాయి. నువ్వు మాత్రం పిచ్‌ను పట్టుకునే వేలాడుతున్నావు.. వాన్ ఫ్రస్టేషన్లో ఉన్నాడు.. అందుకే ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు... వాన్ చేసే పనులు నవ్వు తెప్పిస్తున్నా.. ప్రతీసారి అదే అంటే చిరాకు వేస్తుంది. అంటూ కామెంట్లు పెట్టారు. ఇక, ఇంగ్లండ్ తో నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా రేపటి నుంచి మొతేరాలో ఆఖరి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆఖరి టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రస్తుతం సిరీస్ లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్ట్ లో గెలిచినా, డ్రా చేసుకున్నా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో అడుగుపెడుతోంది.