• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • INDIA VS ENGLAND MICHAEL VAUGHAN SAYS DROPPING SURYAKUMAR YADAV AND CHANGING THE BATTING ORDER LED TO INDIAS DOWNFALL SRD

India vs England : మీ బ్యాటింగ్ ఆర్డర్ కో దండం..టీమిండియా సెలక్షన్ పై మాజీ ప్లేయర్ సెటైర్లు..

India vs England

India vs England : టీమిండియా- ఇంగ్లండ్ సిరీస్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సిరీస్ లో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. అయితే, మరోసారి కోహ్లీసేన పై నోరు పారేసుకున్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.

  • Share this:
    ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ అధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20లో సునాయసంగా గెలుపొందిన భారత్‌ మళ్లీ మూడో మ్యాచ్‌లో తడబడింది. మొదటి మ్యాచ్‌లో విఫలమైన బ్యాట్స్‌మన్‌ మరోసారి మూడో టీ20లోనూ తడబడడంతో టీమిండియా ఓటమిని చవి చూడాల్సివచ్చింది. అయితే, ఇంగ్లండ్ సిరీస్ మొదలైన నుంచి దగ్గరి నుంచి తన నోటికి పని చెబుతున్నా మైకేల్ వాన్ మరోసారి సెటైర్లు వేశాడు. ఐదు టీ20ల సిరీస్‌కు సంబంధించి టీమిండియా మూడో టీ20లో ఓడిపోవడానికి బ్యాటింగ్‌ ఆర్డరే ప్రధాన ‌కారణమని తెలిపాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగా లేదంటూ ‌టీమిండియా సెలెక్టర్లపై మండిపడ్డాడు. ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చడంపై వాన్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాజాగా క్రిక్‌బజ్‌తో మైకేల్‌ వాన్ మాట్లాడుతూ... " టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం తేలిపోతోంది. ప్రస్తుతం టీ20ల్లో ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో ఆడుతున్నామనే విషయం గుర్తుంచుకోవాలి. మొదటి మ్యాచ్‌లో ఓటమి అనంతరం రెండో టీ20లో టీమిండియా అద్భుతంగా ఫుంజుకున్నట్లుగా అనిపించినా.. తర్వాతి మ్యాచ్‌కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగా లేకపోవడయే భారత్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు" అని అన్నాడు.

    " రెండో టీ20లో ఓపెనింగ్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా ఆడాడు. మూడో టీ20కి రోహిత్‌ శర్మ తుది జట్టులోకి తిరిగి రావడంతో ఇషాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానంలో వచ్చాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. రోహిత్‌ శర్మను ఓపెనింగ్‌లో ఆడించినా.. అతనికి జతగా ఇషాన్‌ పంపిస్తే బాగుండు. అప్పడు లోకేష్ రాహుల్‌ మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయంతో సిరీస్‌కు దూరమవడం.. పెళ్లి కారణంతో జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో టీమిండియా బౌలింగ్‌లో లోటు స్పష్టంగా కనిపించింది " అని వాన్ పేర్కొన్నాడు.



    ఇక, మొతేరాలో ఈరోజు జరగనున్న నాలుగో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది. 5 టీ20ల సీరిస్‌లో ఇప్పటికే ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం సిరీస్‌ చేజారుతుంది. దీంతో సమిష్టిగా ఆడి సిరీస్ ను సమం చేయాలని కోహ్లీసేన గట్టిగా ప్రయత్నిస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published: