news18-telugu
Updated: June 30, 2019, 11:13 PM IST
(Image : Twitter)
India Vs England Live Score, ICC Cricket World Cup 2019 Match at Birmingham: బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్లో భారత్ తొలిసారి పరాజయం పాలైంది. వరుసగా మ్యాచుల్లో అప్రతిహత విజయాలను నమోదు చేసిన కోహ్లీ సేన 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తడబడింది. అటు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను నిలువరించడంలో బౌలింగ్ పరంగా విఫలమవగా, లక్ష్యఛేదనలో బ్యాటింగ్ పరంగానూ టీమిండియా విఫలమైంది. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులకు పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది.
కాగా టార్గెట్ ఛేదనలో భాగంగా 2 ఓవర్లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో భారమంతా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే పడింది. ఇద్దరూ నెమ్మదిగా ఆడుతూ వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డారు. స్కోరు 50 పరుగులు దాటేందుకు 14 ఓవర్లు పట్టింది. అనంతరం విరాట్ కోహ్లీ ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే రోహిత్ శర్మ సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 22 ఓవర్లకు స్కోరు 100 దాటింది. అయితే 28వ ఓవర్లో కోహ్లీ(66) ఔట్ కావడంతో భారీ లక్ష్య ఛేదనలో ఒత్తిడి పెరిగింది. అనంతరం రోహిత్ శర్మ(102) సెంచరీ పూర్తి చేసుకొని వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చి రిషబ్ పంత్ (32), హార్దిక్ పాండ్యా (45) ధాటిగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చి ధోనీ సైతం వేగంగా పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు.
ఇదిలా ఉంటే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే ఓపెనర్లు జాసన్ రాయ్ (66), బెయిర్ స్టో(111) రాణించగా తొలివికెట్ భాగస్వామ్యానికి ఇంగ్లాండ్ కేవలం 22 ఓవర్లకే 160 సాధించింది. జాసన్ రాయ్ ఔట్ అయినప్పటికీ ఇంగ్లాండ్ బెయిర్ స్టో రాణించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు కేవలం 30 ఓవర్లకే 200 స్కోరు దాటింది. అనంతరం జానీ బెయిర్ స్టో 31 ఓవర్లో వెనుదిరిగ్గా, ఆ తర్వాత వెంటనే వచ్చినా ఇయాన్ మోర్గాన్ కేవలం ఒక పరుగుకే పెవిలియన్ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన బెన్ స్టోక్స్ (79) రాణించడంతో ఇంగ్లాండ్ స్కోరు 300 దాటింది. భారత్ బౌలర్లలో షమి 5 వికెట్లు పడగొట్టగా, బుమ్రా, కుల్ దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
Published by:
Krishna Adithya
First published:
June 30, 2019, 11:06 PM IST