India Vs England | మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్...పట్టు బిగిస్తున్న భారత్...

India Vs England Live Score, ICC Cricket World Cup 2019 Match at Birmingham: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా కొనసాగుతోంది. 39 ఓవర్లు పూర్తికాగానే ఇంగ్లాండ్ స్కోరు 227 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. క్రీజులో జోరూట్, బెన్ స్టోక్స్ ఆడుతున్నారు.

news18-telugu
Updated: June 30, 2019, 6:00 PM IST
India Vs England | మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్...పట్టు బిగిస్తున్న భారత్...
కోహ్లీ
news18-telugu
Updated: June 30, 2019, 6:00 PM IST
India Vs England Live Score, ICC Cricket World Cup 2019 Match at Birmingham: బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా కొనసాగుతోంది. 39 ఓవర్లు పూర్తికాగానే ఇంగ్లాండ్ స్కోరు 227 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. క్రీజులో జోరూట్, బెన్ స్టోక్స్ ఆడుతున్నారు. ఇదిలా ఉంటే ఓపెనర్లు జాసన్ రాయ్ (66), బెయిర్ స్టో(111) రాణించగా తొలివికెట్ భాగస్వామ్యానికి ఇంగ్లాండ్ కేవలం 22 ఓవర్లకే 160 సాధించింది. జాసన్ రాయ్ ఔట్ అయినప్పటికీ ఇంగ్లాండ్ బెయిర్ స్టో రాణించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు కేవలం 30 ఓవర్లకే 200 స్కోరు దాటింది. అనంతరం జానీ బెయిర్ స్టో 31 ఓవర్లో వెనుదిరిగ్గా, ఆ తర్వాత వెంటనే వచ్చినా ఇయాన్ మోర్గాన్ కేవలం ఒక పరుగుకే పెవిలియన్ ఔటయ్యాడు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ పై ఇంగ్లాండ్ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఇంగ్లాండ్ సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్లు అవుతుంది. అప్పుడు పాకిస్థాన్, బంగ్లాదేశ్ సెమీస్ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే భారత్ ఇప్పటికే సెమీస్ బెర్డు ఖాయం చేసుకున్నప్పటికీ ఈ మ్యాచ్ గెలవడం ద్వారా టోర్నీలో విజయాల ట్రాక్ రికార్డును నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.

First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...