
కోహ్లీ, ధోనీ
IND vs ENG : విజయ్ శంకర్‌ను పక్కన పెట్టిన కోహ్లీ.. పంత్‌కు ఛాన్స్ ఇచ్చాడు.మరోవైపు మోహిన్ అలీ స్థానంలో లియాన్ పంక్లెట్ ఇంగ్లండ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్ - ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బర్మింగ్ హామ్లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మరోవైపు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. వరుసగా అవకాశాలు దక్కినా.. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న విజయ్ శంకర్ స్థానంలో తుదిజట్టులోకి రిషబ్ పంత్ చేరాడు. విజయ్ శంకర్‌ను పక్కన పెట్టిన కోహ్లీ.. పంత్‌కు ఛాన్స్ ఇచ్చాడు.మరోవైపు మోహిన్ అలీ స్థానంలో లియాన్ పంక్లెట్ ఇంగ్లండ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
ఈ రోజు మ్యాచ్‌లో ఆరెంజ్ జెర్సీతో బరిలోకి దిగుతోంది టీమిండియా. ఆతిథ్య జట్టు ఇంగ్లండ్, భారత్ రెండు జట్ల జెర్సీలో బ్లూ కలర్ కాబట్టి ఒక జట్టు జెర్సీ మార్చాల్సి వచ్చింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ డ్రెస్ కలర్ మార్చడానికి వీల్లేదు. దీంతో కోహ్లీ సేన జెర్సీ కలర్ మారింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:June 30, 2019, 14:45 IST