INDIA VS ENGLAND LIVE SCORE 2ND TEST AT CHENNAI DAY1 ROHIT SHARMA FIFTY INDIA RESUME CAUTIOUSLY AFTER LUNCH SA
India vs England: రోహిత్ శర్మ వన్డే బ్యాటింగ్.. కోహ్లి,గిల్ డకౌట్!
Rohit sharma
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో మెుదటి ఇన్నింగ్స్ భారత్ కాస్త తడబడింది. టీమిండియా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులతో లంచ్ విరామానికి వెళ్లింది
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో మెుదటి ఇన్నింగ్స్‌లో భారత్ కాస్త తడబడింది. టీమిండియా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులతో లంచ్ విరామానికి వెళ్లింది. ఓపెనర్ రోహిత్ శర్మ 80, రహానే 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ శుభమన్ గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అతను ఎదుర్కొన్న మూడో బంతికే ఆలీ స్టోన్ బౌలింగ్ ఎల్బీడబ్లూ అయ్యాడు.. ఆ తర్వాత నిలకడగా ఆడుతున్న చతేశ్వర్ పుజారా 21 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్లోక్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక కాసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. మెయిన్ అలీ వేసిన 21వ ఓవర్ మూడో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 86 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కోహ్లి డకౌట్ కావడం ఇది 11వ సారి.
రోహిత్ ఫీప్ట్
ఒకవైపు వికెట్స్ పడుతున్న రోహిత్ మాత్రం తన జోరు కోనసాగిస్తున్నాడు. రోహిత్ శర్మ అర్థ సెంచరీతో ఇంగ్లీష్ బౌలర్స్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. జాక్ లీచ్ 14వ ఓవర్లో ఐదో బంతిని ఫోర్ కొట్టిన రోహిత్(47 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్) ఫిప్టీ పూర్తి చేశాడు. ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్స్‌పై విరుచుపడుతున్నాడు. ఇది తన కెరీర్లో 12వ అర్థ సెంచరీ.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.