• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND LIVE CRICKET SCORE 3RD ODI TEAM INDIA SCORE 329 SA

India Vs England: టీమిండియా భారీ స్కోర్.. స్టోక్స్ మళ్ళీ ఏం చెస్తాడో!

India Vs England: టీమిండియా భారీ స్కోర్.. స్టోక్స్ మళ్ళీ ఏం చెస్తాడో!

team india

India vs England 2021 భారత్,ఇంగ్లాంగ్ మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది.

  • Share this:
    భారత్,ఇంగ్లాంగ్ మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది. 329 పరుగలకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్లు రోహిత్,శిఖర్ ధావన్ స్టడీగా ఆడుతూ వచ్చారు. మెుదటి వికెట్‌కు 106 పరుగులు జోడించారు. 14 ఓవర్లో టీమిండియాను ఇంగ్లాండ్ బౌలర్ రషీద్‌ దెబ్బ కొట్టాడు. స్లో అండ్ స్టడీగా నడుస్తున్న భారత బ్యాటింగ్ లైన్‌ఫ్‌ను దెబ్బ తీశాడు. 13 ఓవర్లకు టీమ్‌ఇండియా 92/0 పరుగులతో స్ట్రాంగ్‌గా కనిపించగా.. రషీద్‌ వరుసగా రెండు వికెట్లు తీసి దెబ్బ తీశాడు. గూగ్లీ రూపంలో వచ్చిన బంతిని హిట్‌మ్యాన్‌ డిఫెండ్‌ చేయలేక క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. రోహిత్‌ శర్మ 37 పరుగులకు  ఔటయ్యాడు. దీంతో టీమ్‌ఇండియా తొలి వికెట్‌ను‌ చేజార్చుకుంది.  ఆ తర్వాత రషీద్‌ మళ్లీ వికెట్ సాధించాడు. శిఖర్‌ ధావన్‌ (67; 56 బంతుల్లో 10×4)ను ఔట్‌ చేశాడు. 16.4వ బంతిని రషీద్‌ గూగ్లీగా విసిరగా గబ్బర్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

    కాసేపటికే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (7; 10 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. మొయిన్‌ అలీ వేసిన 17.4వ బంతిని ఆఫ్ సైడ్ ఆడబోయి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. రాహుల్‌,పంత్ కాసేపు నిలకడగా అడగ్గా వీరు భాగస్వామ్యన్ని లివింగ్‌స్టన్‌ వీడదిశాడు. అతను వేసిన 24.2 ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌(7) ఔటయ్యాడు. ఫుల్‌టాస్‌ బంతిని బ్యాక్‌వర్డ్‌ షార్ట్‌ లెగ్‌లో ఆడగా దాన్ని మోయిన్‌ అలీ డైవ్‌ చేస్తూ అందుకున్నాడు. దీంతో భారత్ 157 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. ఆ తర్వాత పంత్‌(55), హార్దిక్‌ పాండ్య(40) టీమిండియా స్కోర్‌ను పరుగులు పెట్టించారు.

    27 ఓవర్ల నుంచి వీరిద్దరూ రెచ్చిపోయారు. లివింగ్‌స్టన్‌ వేసిన 27వ ఓవర్‌లో పంత్‌ ఒక సిక్స్‌, ఒక బౌండరీ బాదాడు. అప్పటి వారి ఊపు మెుదలైంది. మొయిన్‌ అలీ వేసిన 28 ఓవర్లో హార్దిక్‌ పాండ్య మూడు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్‌లో మొత్తం 20 పరుగులు రాబట్టాడు. ఇలా ఇంగ్లీష్ బౌలర్లను డామినేట్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా భారత ఓపెనర్లను పెవిలియన్ పంపిన రషీద్ టార్గెట్ చేశారు. ఇదే క్రమంలో రిషభ్‌ పంత్‌ 44 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. తర్వాత పంత్‌ 78 పరుగుల వద్ద ఔటయ్యాడు. సామ్‌కరన్‌ వేసిన 36వ ఓవర్‌ చివరి బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఆ తర్వాత బెన్‌స్టోక్స్‌ వేసిన 39వ ఓవర్‌‌లో హార్దిక్‌ పాండ్య(64) ఔటయ్యాడు. స్టోక్స్‌ ఆ ఓవర్‌ చివరి బంతికి పాండ్యా బౌల్డయ్యాడు. దీంతో భారత్ 276 పరుగుల వద్ద ఆరో వికెట్‌ నష్టపోయింది. ఆ తర్వాత కృనాల్‌ పాండ్య(), శార్దూల్‌ ఠాకుర్‌ ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్ళారు.  చివరిలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి. 329 పరుగులకు ఆలౌటైంది.
    Published by:Rekulapally Saichand
    First published: