Home /News /sports /

INDIA VS ENGLAND JASPRIT BUMRAH LED ATTACK DECIMATES HOSTS BATTING TO CLAIM FABULOUS WIN AT THE OVAL VB

Jasprit Bumrah: జస్‌ప్రీత్‌ బుమ్రాపై వైరల్ అవుతున్న న్యూస్.. అదేంటంటే..

100 వ వికెట్ తీసిన ఆనందంలో బుమ్రా

100 వ వికెట్ తీసిన ఆనందంలో బుమ్రా

Jasprit Bumrah: టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తొలి టెస్టు వికెట్‌ను ఎలా దక్కించుకున్నాడో సరిగ్గా అలానే తన వందో వికెట్ కూడా అలానే పొందడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అప్పడు దక్షిణాప్రికా డాషింగ్ బ్యాట్స్ మెన్ ను ఎలా అవుట్ చేశాడో.. అలాగే అతడు పోప్ ను కూడా అలాగే పెవిలియన్ కు పంపించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    టీమిండియా(Team India) స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah) తొలి టెస్టు వికెట్‌ను ఎలా దక్కించుకున్నాడో సరిగ్గా అలానే తన వందో వికెట్ కూడా అలానే పొందడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అప్పడు దక్షిణాప్రికా (South Africa) డాషింగ్ బ్యాట్స్ మెన్ ను ఎలా అవుట్ చేశాడో.. అలాగే అతడు పోప్ ను కూడా అలాగే పెవిలియన్ కు పంపించాడు. దినికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ (England) తో నాలుగో టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే. దీనిలో టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తన కెరీర్ లో తన వంద వికేట్ల మార్కును దాటాడు. 24 టెస్టుల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఫీట్ ను
    సాధించి జడేజాతో అతడు సంయుక్తంగా ఉన్నాడు.

    Cricket: టీమిండియాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్​.. ఐదో టెస్టుకు దూరం కానున్న వైనం

    మరో మైలు రాయిని కూడా బుమ్రా దాటాడు. అదేంటంటే.. బుమ్మా టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల క్లబ్ లో చేరిన జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ టీమిండియా తరఫును అతి తక్కువ టెస్టు మ్యాచ్ లు ఆడి 100 వికెట్ల మార్కును దాటిని వారిలో మొదటి స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ వ్యాప్తంగా చూసుకుంటే అశ్విన్ మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో 16 మ్యాచ్ లల్లో 100 వికేట్లు తీసిన ఆటగాడు.. ఇంగ్లాండ్ కు చెందిన జీఏ లాహ్ మన్ ఉన్నారు. బుమ్మా తన టెస్టు కెరీర్ లో మొదటి వికెట్ ను దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ రూపంలో అందుకున్నాడు.

    Viral Video : కోహ్లీకి కోపం వస్తే ఇలానే ఉంటుంది.. ఔటైన కోపంలో విరాట్ ఏం చేశాడంటే..

    బుమ్రా డెలివరీని ఏబీ డివిలియర్స్‌ ఆడే క్రమంలో బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. ఇక బమ్రా వందో వికెట్‌ కూడా అలాగే వచ్చింది. ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో ఆఫ్‌స్టంప్‌ మీదుగా వచ్చిన బంతిని అంచనా వేయడంలో బ్యాట్స్ మెన్ పోప్ పొరబడ్డాడు. బంతి అద్భుతంగా ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొని నేరుగా వికెట్లను గిరాటేసింది. ప్రస్తుతం బుమ్రా తొలి వికెట్‌.. వందో వికెట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    బుమ్రా తన తొలి టెస్టు వికెట్‌ను ఎలా దక్కించుకున్నాడో.. సరిగ్గా వందో వికెట్‌ కూడా దాదాపు అలాగే పొందడం చర్చనీయాంశంగా మారింది. ఇక బుమ్రా తన తొలి వికెట్‌ను కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సాధించాడు. అయితే బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.

    టీమిండియా మొత్తం జట్టుగా రాణించి ఓవల్ గడ్డపై 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. 1971 లో చివరిసారిగా ఇక్కడ మ్యాచ్ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత కోహ్లీ నేతృత్వంలో భారత్‌ 157 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది. దీంతో టీమిండియా రెండు ఆధిక్యంలో కొనసాగుతోంది.
    Published by:Veera Babu
    First published:

    Tags: India vs england, Team india

    తదుపరి వార్తలు