Home /News /sports /

INDIA VS ENGLAND ISHANT SHARMA FELICITATED BY THE PRESIDENT OF INDIA RAM NATH KOVIND AND AMIT SHAH FOR HIS 100TH TEST SRD

India vs England : ఇషాంత్ శర్మ సెంచరీ...ప్రత్యేక జ్ఞాపిక అంద‌జేసిన‌ రాష్ట్ర‌ప‌తి, అమిత్ షా

ఇషాంత్ శర్మ సెంచరీ...ప్రత్యేక జ్ఞాపిక అంద‌జేసిన‌ రాష్ట్ర‌ప‌తి, అమిత్ షా ( Photo Credit : Twitter)

ఇషాంత్ శర్మ సెంచరీ...ప్రత్యేక జ్ఞాపిక అంద‌జేసిన‌ రాష్ట్ర‌ప‌తి, అమిత్ షా ( Photo Credit : Twitter)

India vs England : ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ ఆరంభమైంది. డే/నైట్‌లో పింక్ బంతితో సమరానికి రెండు జట్లు సిద్ధమయ్యాయ్. మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

ఇంకా చదవండి ...
    ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ ఆరంభమైంది. డే/నైట్‌లో పింక్ బంతితో సమరానికి రెండు జట్లు సిద్ధమయ్యాయ్. మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, ఇండియా త‌ర‌ఫున వందో టెస్ట్ ఆడుతున్న పేస్‌బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ‌కు జ్ఞాపిక‌ను అంద‌జేశారు భారత రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌. ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌దైన క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన త‌ర్వాత ఆయ‌న ఇండియా, ఇంగ్లండ్‌ ప్లేయ‌ర్స్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగానే కోవింద్‌.. ఇషాంత్‌ను జ్ఞాపిక‌తో స‌త్క‌రించారు. ప‌క్క‌నే ఉన్న హోంమంత్రి అమిత్ షా.. ఇషాంత్‌కు ప్ర‌త్యేక‌మైన క్యాప్ అందించారు. ఆ త‌ర్వాత రెండు జ‌ట్ల కెప్టెన్లు కోహ్లి, రూట్.. టీమ్ ప్లేయ‌ర్స్‌ను రాష్ట్ర‌ప‌తికి ప‌రిచయం చేశారు. ఇక ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంలో వందో టెస్ట్ ఆడుతున్న ఇషాంత్‌కే తొలి బంతి వేసే అవ‌కాశం రావ‌డం విశేషం.

    ఇక తన వందో టెస్ట్ లో ఫస్ట్ వికెట్ పడగొట్టాడు ఇషాంత్. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ సిబ్లీ ఇషాంత్ బౌలింగ్ లో రోహిత్ శర్మ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 27 పరుగులకే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇషాంత్ ఓ వికెట్ తీయగా, అక్షర్ పటేల్ మరో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.


    భారత జట్టు : రోహిత్ శర్మ, శుబ్‌మాన్‌ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానే, రిషబ్ పంత్ (w), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, బుమ్రా

    ఇంగ్లాండ్ జట్టు : డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (c), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (w), జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Amit Shah, India vs england, Ramnath kovind

    తదుపరి వార్తలు